ETV Bharat / bharat

నకిలీ వ్యాక్సిన్ ఇచ్చి ఎంపీ మిమీ చక్రవర్తికి టోకరా

బోగస్ ఐఏఎస్​ అధికారి చేతిలో టీఎంసీ ఎంపీ మిమీ చక్రవర్తి మోసపోయారు. అతడు నడుపుతున్న వ్యాక్సినేషన్​ కేంద్రంలో టీకా తీసుకుని.. రెండు రోజుల తర్వాత అనుమానంతో ఆరా తీశారు. ఆ కేంద్రం కూడా నకిలీదే అని తేలింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు ఆ ఎంపీ. ఈ సంఘటన బంగాల్​లో జరిగింది.

author img

By

Published : Jun 23, 2021, 9:16 PM IST

Mimi Chakraborty
మిమీ చక్రవర్తి

బంగాల్​లో ఓ బోగస్ ఐఏఎస్ అధికారి.. నకిలీ వ్యాక్సినేషన్​ కేంద్రం నడుపుతూ.. ఆ రాష్ట్ర అధికార పార్టీ ఎంపీనే మోసం చేశాడు. తాను కోల్​కతా మున్సిపల్​ కార్పొరేషన్​లో​(కేఎంసీ) జాయింట్​ కమిషనర్​ను​ అంటూ.. అమాయక ప్రజలను దోచుకుంటున్న ఆ మాయగాడు.. తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మిమీ చక్రవర్తికి టీకా వేయించాడు. అడ్డంగా బుక్కయ్యాడు.

False vaccination
నకిలీ ఐఏఎస్​ అధికారి ఐడీ కార్డు, కారు

ట్రాన్స్​జెండర్ల కోసమంటూ.. ఎంపీకి ఆహ్వానం

దెవంజన్​ దేవ్​ అనే వ్యక్తి.. కేఎంసీలో డిప్యూటీ కమిషనర్​నని చెప్పుకుంటూ.. నగరంలోని కస్బా ప్రాంతంలో నకిలీ వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని నడుపుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్​జెండర్లు, దివ్యాంగుల కోసం నడుపుతున్న టీకా కేంద్రమని చెప్పి.. మిమీ చక్రవర్తిని ఆహ్వానించాడు​. ఆమెకు కూడా టీకా వేయించాడు. వ్యాక్సిన్​ తీసుకుని రెండురోజులు కావస్తున్నా.. ఇంకా ధ్రువపత్రం రాలేదు. వెంటనే విషయాన్ని ఆ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం అందించారు మిమీ. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. అటువంటి టీకా కేంద్రమేది లేదని తేల్చారు.

"ఆ వ్యాక్సినేషన్​ కేంద్రం నిర్వాహకులు ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లాను. నేను కూడా టీకా వేయించుకోవాలని నిర్ణయించుకుని.. తొలిడోసు తీసుకున్నా. అయితే నా మొబైల్​కు ధృవీకరణ పత్రం రాలేదు. దాని గురించి దేవ్​ను అడిగాను. అందుకు అతను.. త్వరలో సర్టిఫికెట్​ వస్తుందని చెప్పారు. మరోరోజు వరకు ఎదురుచూశాను. అయినా సర్టిఫికేట్​ రాలేదు. నా సహచరులు మళ్లీ అడిగారు. అయితే రెండు మూడు రోజుల్లో ధ్రువపత్రం వస్తుందని వారికి చెప్పారు. నాకు సందేహాలు వచ్చాయి. సంబంధిత అధికారులకు సమాచారం అందించాను. దీంతో అసలు విషయం తెలిసింది."

- మిమీ చక్రవర్తి, టీఎంసీ ఎంపీ

ఎవరీ దేవ్​?

అతను గొప్ప కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అతని తండ్రి రిటైర్డ్​ ఎక్సైజ్ కలెక్టర్​. ఐఏఎస్​ అధికారి కావాలన్నది దేవ్ లక్ష్యం. ఇందుకు యూపీఎస్​సీ నిర్వహించిన పరీక్షలకు కూడా రాశాడు. కాని అర్హత సాధించలేకపోయాడు. దీంతో కుంగుబాటుకు గురయ్యాడు.

​ఆ టీకాలు​ ఎక్కడివి?

ఓ వ్యాక్సిన్​ కేంద్రాన్ని నడిపించడానికి కావాల్సిన టీకాలు ఎలా లభించాయన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రషీద్ మునీర్ ఖాన్​ తెలిపారు. నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా కోల్‌కతాలోని హోల్‌సేల్ మార్కెట్​లోని మెడిసిన్ డీలర్ వద్ద టీకాలు సేకరించినట్లు ప్రాథమిక విచారణలో దేవ్​ వెల్లడించాడని అధికారులు తెలిపారు. అలాగే ఆ టీకాలు నకిలీవో.. కాదో.. పరీక్షల తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో తమ సిబ్బంది పాత్ర ఉన్నట్లు తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని కేఎంసీ ఛైర్మన్​ ఫిర్హద్​ హకీమ్ తెలిపారు.

ఇదీ చూడండి: ఆ పిటిషన్​కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.