ETV Bharat / bharat

అసెంబ్లీలోకి 'ఫేక్ ఎమ్మెల్యే'.. బడ్జెట్​ సమావేశాలు జరుగుతుండగా..! - అసెంబ్లీలోకి ఫేక్ ఎమ్మెల్యే న్యూస్

బడ్జెట్​ సమావేశాలు జరుగుతున్న సమయంలో.. ఓ 'ఫేక్​ ఎమ్మెల్యే' అసెంబ్లీలోకి ప్రవేశించాడు!. అనుమానమొచ్చిన సిబ్బంది అతడికి పలు ప్రశ్నలు అడగ్గా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో సిబ్బంది.. అతడిని పోలీసులు అప్పగించారు. అయితే ఈ ఘటన తర్వాత అసెంబ్లీ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

Fake MLA in West Bengal news
బంగాల్ అసెంబ్లీలో ఫేక్ ఎమ్మెల్యే
author img

By

Published : Feb 16, 2023, 10:26 AM IST

Updated : Feb 16, 2023, 11:36 AM IST

అసెంబ్లీలోకి ఓ 'ఫేక్​ ఎమ్మెల్యే' ప్రవేశించిన ఘటన బంగాల్​లో కలకలం రేపింది. విధానసభ గేటు దాటి ప్రధాన భవనం వద్దకు చేరుకున్న ఆ ఫేక్ ఎమ్మెల్యేను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన తర్వాత అసెంబ్లీ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలేం జరిగిందంటే?..
బంగాల్​లో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఆ 'ఫేక్ ఎమ్మెల్యే' అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్​ దాటి ప్రవేశించాడు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్​రాయ్​ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగగా.. హరీష్ ఛటర్జీ స్ట్రీట్ నుంచి వచ్చానని తెలిపాడు. అతడి మాటల్లో పొంతన లేకపోవటం వల్ల చాలా సేపు విచారించి పోలీసులకు అప్పగించారు.

అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని అతడు శాసనసభ గేటు దాటడం మాత్రమే కాకుండా విధానసభ వరండాలోకి కూడా ప్రవేశించాడు. అతడు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు? అరూప్​ రాయ్ పేరును ఎందుకు ప్రస్తావించాడు? హరీశ్ ఛటర్జీ వీధి గురించి ఎందుకు మాట్లాడాడు? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. "మమతా బెనర్జీ హయాంలో అసెంబ్లీలో ఏదైనా జరగవచ్చు. ఎవరికీ ఇక్కడ రక్షణ లేదు" అని భాజపా ఎమ్మెల్యే మనోజ్ టిగ్గా ఆరోపించారు. మరోవైపు అధికార ప్రతినిధి తపస్ రాయ్ కూడా స్పందించారు. "ఈ ఘటన నిజంగా ఆందోళన కలిగిస్తుంది. అసలేం జరిగిందో అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తారు" అని అన్నారు. అయితే ఈ వ్యవహారంపై అసెంబ్లీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు.

Last Updated : Feb 16, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.