fake degree certificate scam: దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలు, నకిలీ మార్క్షీట్లు తయారు చేస్తున్న కేసులో ఓ మహిళను అరెస్టు చేశారు గుజరాత్ పోలీసులు. 2021 డిసెంబర్ 10న బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం పేరిట నకిలీ వెబ్సైట్, తప్పుడు ధ్రువపత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 30 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. నిందితురాలిని బౌలా నంద్ రాయ్‌గా గుర్తించారు.
35 Universities fake scam
35 యూనివర్సిటీలకు చెందిన ధ్రువపత్రాలను నిందితురాలు ఫోర్జరీ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో 510 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు దొరికాయని వెల్లడించారు. 94 రబ్బర్ స్టాంపులు, మార్క్షీట్లు, కలర్ ప్రింటింగ్ మెషీన్లు, హాల్మార్కులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Gujarat fake certificates scam
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల పేరు మీద మహిళ నిర్వహిస్తున్న 73 వెబ్సైట్ల డొమైన్లను తమ అధీనంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిందితురాలిపై వివిధ కేసులు నడుస్తున్నాయని చెప్పారు. నిందితురాలి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ అని.. ప్రస్తుతం దిల్లీలో నివసిస్తోందని వివరించారు. నకిలీ వెబ్సైట్లను దిల్లీలోని ఉత్తమ్‌నగర్ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్‌లో 5.3 కోట్ల హెరాయిన్