ETV Bharat / bharat

'భజరంగ్​ దళ్​ను నిషేధిస్తే ఇబ్బందా?'

ఫేస్​బుక్​.. తమ సిబ్బంది భద్రత దృష్ట్యా భజరంగ్​ దళ్​ను నిషేధించటం లేదంటూ వచ్చిన కథనాలపై ఫేస్​బుక్​ భారత విభాగం ఎండీ అజిత్​ మోహన్​ను ప్రశ్నించింది పార్లమెంటరీ కమిటీ​.

author img

By

Published : Dec 16, 2020, 6:23 PM IST

Facebook's India head deposes before Parliamentary panel
' భజరంగ్​ దళ్​ను ఎందుకు నిషేధించలేదు'

ఫేస్​బుక్​.. తమ సిబ్బంది భద్రత దృష్ట్యా భజరంగ్​ దళ్ సంస్థను నిషేధించటం లేదంటూ వచ్చిన వార్తలపై ఫేస్​బుక్​ భారత విభాగం ఎండీ అజిత్​ మోహన్​ను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది .

కాంగ్రెస్​ నేత శశి థరూర్​ నేతృత్వంలో సమాచార, సాంకేతిక వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ... పౌరల వ్యక్తిగత సమాచార భద్రత విషయమై మోహన్​కు సమన్లు జారీ చేసింది. ఆయనతోపాటు ఫేస్​బుక్​ పబ్లిక్ పాలసీ డైరెక్టర్​ శివ్​నాథ్​ తుక్రాల్ ప్యానల్ ఎదుట హాజరయ్యారు. "భజరంగ్​ దళ్​ను నిషేధించాలని ఫేస్​బుక్​ అంతర్గత సమీక్షలో నిర్ణయం తీసుకున్నా... సంస్థ ఆర్థిక ప్రయోజనాలు, సిబ్బంది భద్రత దృష్ట్యా అలా చేయడం లేదు" అంటూ ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించిన కథనాన్ని థరూర్​తో కలిసి ప్రస్తావించారు కమిటీ సభ్యుడు కార్తీ చిదంబరం. ఈ వార్తలో నిజానిజాలపై ఫేస్​బుక్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : పార్లమెంట్ కమిటీ భేటీ నుంచి రాహుల్​ వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.