ETV Bharat / bharat

అధునాతన పినాక రాకెట్ పరీక్షలు విజయవంతం - రాకెట్ పరీక్షలు విజయవంతం

దేశీయ సాంకేతికతతో రూపొందించిన రెండు రాకెట్లను డీఆర్​డీఓ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. పినాక రాకెట్ మెరుగైన్ వెర్షన్, 22 ఎంఎం క్యాలిబర్​ రాకెట్​కు సంబంధించిన మెరుగైన వెర్షన్​ను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

drdo
డీఆర్​డీఓ పినాక
author img

By

Published : Jun 26, 2021, 7:08 AM IST

దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు రకాల రాకెట్​లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO)శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్​లో ఉన్న ప్రయోగ వేదిక వద్ద ఈ పరీక్షలు జరిగాయి.

  • #WATCH | DRDO successfully test fired the extended-range version of indigenously developed Pinaka rocket from a Multi-Barrel Rocket Launcher (MBRL) on 24th and 25th June 2021 at Integrated Test Range (ITR), Chandipur off the coast of Odisha. pic.twitter.com/6Qb0XN3VZD

    — ANI (@ANI) June 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పినాక మెరుగైన వెర్షన్..

పినాక రాకెట్​కు సంబంధించిన మెరుగైన వెర్షన్​ను.. భిన్న లక్ష్యాలపై శరపరంపరగా ప్రయోగించారు. గురు, శుక్రవారాల్లో మొత్తం 25 'ఎన్​హెన్స్​డ్​ పినాక'లను పరీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ల పరిధిని పెంచటం వల్ల 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అవి సొంతం చేసుకున్నాయని పేర్కొన్నాయి.

అలాగే 122 ఎంఎం క్యాలిబర్​ రాకెట్​కు సంబంధించిన మెరుగైన వెర్షన్లను శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా బహుళ ప్రయోగ లాంచర్ నుంచి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. పినాక, 122 ఎంఎం రాకెట్ల గమనాన్ని టెలిమెట్రీ, రాడార్​, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలతో పరిశీలించారు. ప్రయోగ లక్ష్యాలన్నీ నెరవేరాయని అధికారులు తెలిపారు. ఈ రాకెట్లను పుణెలో డీఆర్​డీఓకు చెందిన ఆర్మమెంట్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్ ఎస్టాబ్లిష్​మెంట్(ఏఆర్​డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్​ రీసెర్చ్​ ల్యాబొరేటరీ(హెచ్​ఈఎంఆర్​ఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. 122 ఎంఎం రాకెట్లను భారత సైన్యం కోసం రూపొందించారు.

అవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి : ఆ ఫ్రెండ్స్​ కోసం రాష్ట్రపతి రైలు ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.