ETV Bharat / bharat

ఆ జవాను కోసం ముమ్మర గాలింపు.. కానీ..

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ ఎన్​కౌంటర్​ అనంతరం గల్లంతైన జవానును గుర్తించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఆ జవాను మావోయిస్టుల ఆధీనంలో ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

Exploring all channels to trace jawan: Chhattisgarh Police
ఆ జవాను కోసం ముమ్మర గాలింపు.. కానీ
author img

By

Published : Apr 6, 2021, 1:52 PM IST

Updated : Apr 6, 2021, 2:02 PM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​ ఎన్​కౌంటర్​లో గల్లంతైన కోబ్రా కమాండోను గుర్తించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. ఆ జవాను గురించి సమాచారం సేకరించేలా పోలీస్​ ఇన్ఫార్మర్లను అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. స్థానిక గ్రామాల్లోని ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.

బీజాపుర్​ ప్రాంతంలో శనివారం నక్సలైట్లు-సీఆర్​పీఎఫ్​ జవాన్ల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 22మంది సైనికులు అమరులయ్యారు. మరో 31మంది గాయపడ్డారు. అయితే ఎన్​కౌంటర్​ అనంతరం.. 210 కోబ్రా బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్​ రాకేశ్వర్​ సింగ్​ మిన్హాస్ గల్లంతయ్యారు. సైనికుడిని మావోయిస్టులు అపహరించినట్టు తనకు ఫోన్​ వచ్చిందని ఓ జర్నలిస్ట్​ వెల్లడించారు.

"గల్లంతైన జవాను మావోయిస్టుల వద్దే ఉన్నాడని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. మావోయిస్టులు.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు ఏవీ చేయలేదు. కానీ ఆ జవానును గుర్తించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము."

--- పీ సుందర్ ​రాజ్​, బస్తర్​ ఐజీ.

అయితే గల్లంతైన జవాను.. నక్సలైట్ల వద్ద ఉండే అవకాశాలే ఎక్కువని మరో సీనియర్​ అధికారి అభిప్రాయపడ్డారు. ఎన్​కౌంటర్​ ప్రాంతంలో రెండు రోజులు నిర్బంధ తనిఖీలు నిర్వహించినా.. జవాను ఆచూకీ తెలియకపోవడమే ఇందుకు కారణమన్నారు.

ఇదీ చూడండి:- నక్సల్స్​ ఎత్తుగడలు తెలిసీ- చిక్కుకుంటున్న బలగాలు

Last Updated : Apr 6, 2021, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.