ETV Bharat / bharat

ఎగ్జిట్​పోల్స్​: అసోంలో రెండోసారి భాజపా జయకేతనం!

author img

By

Published : Apr 29, 2021, 9:16 PM IST

ఈశాన్య రాష్ట్రం అసోంలో.. భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్​పోల్​ ఫలితాలు విడుదల చేసిన సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే.. అధికార కూటమికి ఈసారి గతం కంటే కొన్ని స్థానాలు తగ్గనున్నట్లు వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో మ్యాజిక్​ ఫిగర్​ 64 కాగా.. భాజపా కూటమి 70కిపైగా స్థానాలతో గెలుపొందుతుందని పేర్కొన్నాయి.

Assam Exit Polls 2021
అసోం ఎగ్జిట్​పోల్స్

అసోంలో భాజపా మరోసారి అధికారం నిలబెట్టుకోనుందని వివిధ సంస్థలు ఎగ్జిట్​పోల్​ ఫలితాలను విడుదల చేశాయి. భాజపా కూటమి 61 నుంచి 79 నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని టుడేస్ చాణక్య ప్రకటించింది. కాంగ్రెస్​ కూటమి 47 నుంచి 65 సీట్లు, ఇతరులు 3 చోట్ల విజయం సాధించనున్నట్టు పేర్కొంది.

ETV Bharat Survey polls
ఈటీవీ భారత్​ సర్వే వివరాలు

ఆక్సిస్​ మై ఇండియా సర్వే..

అసోంలో రెండోసారి భాజపా కూటమి జయకేతనం ఎగురవేస్తుందని ఆక్సిస్​ మై ఇండియా ఎగ్జిట్​ ఫలితాలను ప్రకటించింది. భాజపా 75 నుంచి 85 స్థానాలు, కాంగ్రెస్​ కూట 40 నుంచి 50 సీట్లు.. ఇతరులు ఒకటి నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించనున్నట్లు వెల్లడించింది.

ఆజ్​తక్​ అంచనాలిలా..

అసోంలో కాషాయ దళం రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆజ్​తక్​ ఎగ్జిట్​పోల్​ ఫలితాలు ప్రకటించింది. కమలం పార్టీ 75 నుంచి 85 సెగ్మెంట్లలో గెలుపొందుతుందని ఆజ్​తక్​ విడుదల చేసింది. కాంగ్రెస్​ కూటమి 40 నుంచి 50 స్థానాలు గెలుపొందుతాయని పేర్కొంది.

టైమ్స్​ నౌ-సీ ఓటర్​ సర్వే..

అసోంలో మళ్లీ భాజపానే గెలుస్తుందని టైమ్స్​ నౌ-సీ ఓటర్ ఎగ్జిట్​ ఫలితాలు విడుదల చేసింది. అధికార కూటమి 65 స్థానాలు గెలుపొందుతుందని పేర్కొంది. కాంగ్రెస్​ కూటమి 59సీట్లు, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించనున్నట్లు చనా వేసింది.

జన్​కీ బాత్​ ఫలితాలిలా..

అసోంలో ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేస్తుందని జన్​కీ బాత్​ ఎగ్జిట్​ ఫలితాలు ప్రకటించింది. భాజపా కూటమి 71 నుంచి 80 నియోజకవర్గాల్లో గెలుపొందనున్నట్లు తెలిపింది. యూపీఏ 55 నుంచి 45చోట్ల ఆధిక్యం సాధించనున్నట్లు పేర్కొంది. ఇతరులు ఒకచోట గెలిచే అవకాశం ఉందని జన్​కీ బాత్​ వెల్లడించింది.

ఇదీ చదవండి: మహంత శకం ముగిసినట్లేనా?

ఇదీ చదవండి: అసోం పోరులో ప్రజలను ఏజీపీ మెప్పించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.