ETV Bharat / bharat

మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యంపై ఎయిమ్స్​ కీలక ప్రకటన - మన్మోహన్ సింగ్

భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​కు (Manmohan Singh Latest News) డెంగీ సోకింది. అయితే ఆయన క్రమంగా కోలుకుంటున్నారని దిల్లీ ఎయిమ్స్​ అధికారులు వెల్లడించారు.

Manmohan Singh
Manmohan Singh
author img

By

Published : Oct 16, 2021, 5:24 PM IST

భారత మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ (Manmohan Singh Latest News)​ డెంగీ జ్వరం బారినపడినట్లు దిల్లీ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం (Manmohan Singh Health) మెరుగవుతోందని శనివారం వెల్లడించారు.

89 ఏళ్ల మన్మోహన్​... అస్వస్థత కారణంగా బుధవారం దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. "మన్మోహన్​కు డెంగీ జ్వరం వచ్చింది. అయితే ఆయన ప్లేట్​లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది," అని అధికారులు తెలిపారు.

ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్​లోని ఓ ప్రైవేట్ వార్డులో మన్మోహన్​ చికిత్స పొందుతున్నారు. ఆయనను గురువారం కలుసుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.

ఇదీ చూడండి: నిలకడగా మన్మోహన్ ఆరోగ్యం- కోలుకోవాలని ప్రధాని ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.