బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో పలువురు విపక్ష నేతలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది.
"ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమైన ప్రతిసారి మేం సమాధానం చెబుతున్నాం. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం. సుప్రీం కోర్టు సైతం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పింది."
- ఎన్నికల సంఘం
ఉపగ్రహాలను భూమి నుంచే ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈవీఎంలను ఎందుకు ట్యాంపరింగ్ చేయలేరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు. అయితే మరో కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమన్నారు.
"తమకు సానుకూలంగా ఫలితాలు రాకపోతే రాజకీయ పార్టీలు.. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం సర్వసాధారణమై పోయింది. అయితే ఈ ఆరోపణలు ఇప్పటి వరకు రుజువు కాలేదు. నాకు తెలిసినంత వరకు ఈవీఎంలను కచ్చితంగా ట్యాంపరింగ్ చేయలేం."
- కార్తీ చిదంబరం, కాంగ్రెస్ నేత
- ఇదీ చూడండి: ఈవీఎంలు ఉంటే ట్రంప్ గెలిచేవారేమో: కాంగ్రెస్