ETV Bharat / bharat

పాత అంబులెన్స్​లకు 'కొత్త' రంగు- వార్త రాసిన రిపోర్టర్​​పై కేసు! - అంబులెన్స్​ల వివాదం

ప్రభుత్వ అంబులెన్స్​లను కొత్త స్టిక్కర్లు, కొత్త పేర్లతో పలుమార్లు ప్రారంభించటంపై కథనం రాసిన ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై బిహార్​లోని బక్సర్​లో కేసు నమోదైంది. భాజపా నేత పరశురామ్​ చతుర్వేది ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. ఈ అంశంపై వరుసగా కథనాలు ప్రచురించటం వల్ల రాజకీయంగా దుమారం చెలరేగటమే ఇందుకు కారణం. రిపోర్టర్​కు మద్దతు ప్రకటించాయి అక్కడి విపక్షాలు.

ETV Bharat
ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై కేసు
author img

By

Published : May 30, 2021, 3:27 PM IST

బిహార్​ బక్సర్​లో ప్రభుత్వ అంబులెన్స్​లకు కొత్త రంగు వేసి కొత్త వాటిలా పలుమార్లు ప్రారంభించటంపై ఈటీవీ భారత్​ కథనం రాసింది. ఆ వార్త రాజకీయంగా దుమారం లేపటం వల్ల ఆగ్రహించిన భాజపా నేత పరశురామ్​ చతుర్వేది.. ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్​ 500,506,420, 34 సెక్షన్ల కింద జిల్లాలోని సదర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

రిపోర్టర్​ ఉమేశ్​ పాండేపై చతుర్వేది తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే గౌరవానికి భంగం కలిగించారని, భాజపా ప్రతిష్ఠను దెబ్బతీశారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జరిగిందేమిటి?

కొత్త స్టిక్కర్లు అంటించిన.. 5 పాత అంబులెన్స్​లను మే 15న కేంద్ర మంత్రి అశ్విని చౌబే వర్చువల్​గా ప్రారంభించారని ఈటీవీ భారత్​ కథనం ప్రచురించింది. అవే అంబులెన్స్​లను ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రారంభించారని వెలుగులోకి వచ్చింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి చౌబేను సంప్రదించేందుకు రిపోర్టర్​ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు.

ఇందులో ఉన్న మరో కొత్త ట్విస్ట్​ను బహిర్గతం చేసింది ఈటీవీ భారత్​. ఆ అంబులెన్స్​లు కనీసం రవాణా శాఖ వద్ద రిజిస్టర్​ కూడా చేయలేదని తెలిపింది. దీనిపై బక్సర్​ జిల్లా రవాణా శాఖ అధికారి మనోజ్​ రజాక్​ను కలవగా.. బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్లను 2020, ఆగస్టులో సుప్రీం కోర్టు నిషేధించిందని తెలిపారు. అందుకే వాటిని రిజిస్టర్​ చేయలేదన్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు కారణమైతే వాటిని వినియోగించే వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్​ చేస్తామని స్పష్టం చేశారు.

అయితే.. ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితమై రాజకీయంగా వివాదం రాజుకున్న క్రమంలో మాట మార్చారు రవాణా అధికారి. సాఫ్ట్​వేర్​ సమస్య వల్ల అంబులెన్స్​లను రిజిస్టర్​ చేయలేదని, ప్రస్తుతం ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

ఈ అంశంపై పలు కథనాలు రాసింది ఈటీవీ భారత్​.​ జిల్లాలోని మొత్తం 102 అంబులెన్స్​లు తొలుత సదర్​ ఆసుపత్రిలో ఆ తర్వాత బక్సర్​ కిలా మైదాన్​లో 'డాక్టర్​ అట్​ యువర్​ డోర్​స్టెప్​' పేరిట ప్రారంభించారు. మూడోసారి కైముర్​లోని రామ్​గఢ్​లో ఆ తర్వాత కలెక్టరేట్​ ఆడిటోరియంలో 'మహర్షి విశ్వమిత్ర మొబైల్​ వెహికిల్​'​ పేరుతో ప్రారంభించారు.

రాజకీయ దుమారం..

ఈ అంశంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రారంభోత్సవానికి మాత్రమే కేంద్ర మంత్రి అశ్విని చౌబే అంబులెన్స్​లను తీసుకొచ్చారని, వచ్చే ఏడాది కోసం మళ్లీ తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​. అంబులెన్స్​లను ధనుష్​ ఫౌండేషన్​కు ఇచ్చారని, దాంతో ప్రజలు రోగులను భుజాలపై ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు కాంగ్రెస్​ సదర్​ ఎమ్మెల్యే సంజయ్​ తివారి. కొవిడ్​ మరణాలకు అశ్విని చౌబేనే కారణమని పేర్కొన్నారు.

అయితే.. అశ్విని చౌబే అంబులెన్స్​లను ప్రారంభించలేదని, మెడికల్​ మొబైల్​ యూనిట్​ను ప్రారంభించారనే విషయాన్ని విపక్ష నేతలు గుర్తు చేసుకోవాలని ఎదురుదాడి చేశారు భాజపా నేత పరశురామ్​ చతుర్వేది.

రిపోర్టర్​పై ఎఫ్​ఐఆర్​ను ఖండించిన ఆర్​జేడీ

అంబులెన్స్​లపై కథనాలు రాసిన ఈటీవీ భారత్​ రిపోర్ట్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండించింది ఆర్​జేడీ. ఉమేశ్​ పాండేకు పూర్తి మద్దతు ప్రకటించారు ఆర్​జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్​ సింగ్​. ప్రజల్లో అవగాహన కల్పించటంలో తన వంతు పాత్రను ఈటీవీ భారత్​ పోషించిందని కొనియాడారు. బక్సర్​లోని గంగా నదిలో మృతదేహాల అంశాన్ని ప్రజలకు చూపించిందని గుర్తు చేసుకున్నారు. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే రిపోర్టర్​పై కేసు పెట్టారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 12 ఏళ్లకే 'టోఫెల్'​ ఉత్తీర్ణత- కశ్మీర్​ బాలిక ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.