కరోనా కట్టడి చర్యల్లో భాగంగా.. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించినా వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండరాదని సూచించింది. ఆంక్షలు అమలులో ఉన్నా టీకా పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ మనోహర్ అగ్నాని లేఖ రాశారు.
"కరోనాను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి తదితర కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో టీకా పంపిణి కేంద్రాలకు లబ్ధిదారులు వెళ్లేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. టీకా పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేలా సంబంధిత అధికారులు దృష్టి సారించాలి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను."
-మనోహర్ అగ్నాని, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి టీకా పంపిణీ ప్రక్రియ.. అత్యంత కీలకమైన వ్యూహామని మనోహర్ అగ్నాని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు 12.26 కోట్లు టీకా డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: తమిళనాడు, బిహార్‌లో రాత్రి కర్ఫ్యూ
ఇదీ చూడండి: 'మహా'లో కరోనా కల్లోలం- కొత్తగా 68వేల కేసులు