ETV Bharat / bharat

'ఫీజుకు బదులు గోవులు'- ఆఫర్ ఇచ్చిన ఇంజినీరింగ్​ కాలేజ్​ సీజ్​! - బిహార్ వార్తలు

ఇంజినీరింగ్​ ఫీజుకు బదులుగా గోవులను అంగీకరించిన ఓ కాలేజ్ మూతపడింది. రూ.కోట్లు రుణం​ తీసుకుని తిరిగి​ చెల్లించలేదనే కారణంతో బ్యాంక్​ దీన్ని సీజ్ చేసింది. 2010లో ప్రారంభమైన ఈ కళాశాల 11 ఏళ్లకే మూతపడుతుండటం వల్ల వందలాది మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది.

Engineering college that offered cows as fee shut over non-repayment of loan
ఫీజుకు బదులు గోవులు తీసుకున్న ఇంజినీరింగ్​ కాలేజ్ సీజ్​
author img

By

Published : Oct 29, 2021, 6:59 PM IST

2010లో ప్రారంభమైన ఓ ఇంజినీరింగ్ కళాశాల పీజుకు బదులు విద్యార్థులు గోవులు ఇవ్వవచ్చనే ఆఫర్​తో బాగా పాపులర్​ అయింది. కానీ బ్యాంక్​ నుంచి తీసుకున్న రుణం చెల్లించని కారణంగా 11ఏళ్లకే మూతపడే పరిస్థితి వచ్చింది. రూ.కోట్లు లోన్ తీసుకుని తిరిగి కట్టడం లేదని ఈ కాలేజ్​ను ప్రైవేటు బ్యాంకు అధికారులు సీజ్ చేశారు.

బిహార్ బక్సర్​లోని అరియాన్​ గ్రామంలో ఉన్న ఈ కాలేజ్ పేరు విద్యాదాన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్​మెంట్​(VITM). డీఆర్​డీఓ మాజీ శాస్త్రవేత్తలు ఎస్​ కే సింగ్, అరుణ్​ కుమార్ వర్మ, బెంగళూరుకు చెందిన డాక్టర్​ మయూరి శ్రీవాత్సవ, సామాజిక కార్యకర్త లాల్​ దేవ్​ సింగ్ ఈ కళాశాలను ప్రమోట్ చేస్తున్నారు. పట్నాలోని ఆర్యబట్ట జ్ఞాన్ యూనివర్సిటీకి ఇది అనుబంధంగా ఉంది. దీన్ని స్థాపించినప్పుడు ఇంజినీరింగ్ ఫీజు చెల్లించలేని విద్యార్థులు 5 గోవులను ఇవ్వవచ్చని యాజమాన్యం ఇచ్చిన ఆఫర్​.. చుట్టపక్కల గ్రామాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ కాలేజ్​లో ఇంజినీరింగ్ వార్షిక ఫీజు రూ.72,000. పేద విద్యార్థులు దీనికి బదులు మొదటి ఏడాదిలో రెండు గోవులు, మిగతా మూడు సంవత్సరాల్లో ఒక్కో గోవును ఇవ్వాల్సి ఉంటుంది.

మొదట్లో బాగానే ఉన్న ఈ కళాశాల.. ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చింది. రూ.5.9కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదనే కారణంతో దీన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజ్ చేసింది. దీంతో 300మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది.

బక్సర్​, వారణాసి మధ్య ఉన్న ఏకైక ఇంజినీరింగ్ కాలేజ్ తమదేనని కాలేజ్ ప్రమోటర్​ ఎస్​కే సింగ్ తెలిపారు. 'ఫీజుకు బదులు గోవులు' కాన్సెప్ట్ చక్కగానే పనిచేసిందని వెల్లడించారు. 2010లో తమ కాలేజ్​లో మౌలిక సదుపాయాల కోసం బ్యాంక్ ఆఫ్​ ఇండియా పట్నా బ్రాంచ్ తొలుత రూ.4.65 కోట్ల రుణం ఇచ్చిందని, 2011లో మరో రూ.10కోట్లg ఇస్తామని చేసినప్పటికీ నగదు మంజూరు నిలిపివేసిందని వివరించారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద బ్యాంకులో రూ.15కోట్లు విలువ చేసే ఆస్తులు తనఖా పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్స్ కారణంగా కాలేజ్ మూతపడుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

'2012 వరకు ఈఎంఐ కట్టాం. 2013లో మరికొంత మొత్తాన్ని చెల్లించాం. మాకు ఇస్తామన్న ఆర్థిక సాయం రూ.10కోట్లు ఇవ్వకుండా బ్యాంకు రికవరీపై దృష్టి పెట్టింది. దీనివల్ల వందల మంది విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో పడింది.' అని సింగ్ పేర్కొన్నారు.

అయితే ఈ ప్రాజెక్టు ద్వారా అంచనా వేసినట్లుగా ఫలితాలు రాకపోవడం వల్లే అదనపు రుణాన్ని ఇవ్వలేకపోయామని బ్యాంకు అధికారి వివరించారు.

200మంది గ్రాడ్యుయేట్లు..

ఈ కాలేజ్ నుంచి 200మంది విద్యార్థులు ఇంజినీరింగ్​లో పట్టభద్రులయ్యారు. వారిలో 20మంది గోవులను ఫీజుగా చెల్లించారు. ప్రస్తుతం 29మంది విద్యార్థులు ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయాల్సి ఉంది.

ఈ కాలేజ్​లో చదువుకున్న విద్యార్థుల్లో కొందరు దేశ, విదేశాల్లో మంచి హోదాలో స్థిరపడ్డారు. విజేంద్ర మిశ్రా అనే విద్యార్థి IOCLలో లీడ్ సేఫ్టీ ఆఫీసర్​గా పని చేస్తున్నాడు. తాను ఇంజినీర్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదని, ఫీజుకు బదులు గోవులు ఇవ్వచ్చని తెలిసి ఈ కళాశాలలో చేరినట్లు చెప్పాడు. సమీప గ్రామాల్లో ఫీజు చెల్లించే స్తోమత లేని ఎంతో మంది పేద విద్యార్థులు ఈ కాలేజ్​లో చేరినట్లు వివరించాడు.

ఇదీ చదవండి: 'మోదీ మళ్లీ పీఎం అవ్వాలంటే.. యోగి సీఎం కావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.