Encounter In Srinagar: జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్ శివారులోని రంగ్రెత్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
మృతులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.