Employee Asked Leave to Help Wife : సాధారణంగా ఉద్యోగులు పండగల సమయంలో సెలవులు అడగడం సాధారణమే. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఉద్యోగి తన భార్యకు పండగ సాయంలో తోడుగా ఉంటానని.. తాను ఉపవాసం ఉంటానని ఉన్నతాధికారులకు లీవ్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఈ లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
రాజ్‌కుమార్ అనే వ్యక్తి అమ్రోహా జిల్లాలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం కార్వ చౌత్ సందర్భంగా సెలవు కావాలని కోరాడు రాజ్‌కుమార్. కార్వ చౌత్ కావడం వల్ల తన భార్యతో తాను ఉపవాసం ఉంటానని.. పూజలో ఆమెకు సహాయం చేయాలని అందులో చెప్పాడు. ఇందుకోసం తాను కార్యాలయానికి రాలేకపోతున్నానని తెలిపాడు. దీంతో అతడు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
అయితే, ఈ విషయంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్పాల్ సింగ్ స్పందించారు. రాజ్‌కుమార్.. పోర్టల్ ద్వారా సెలవు దరఖాస్తు చేసుకున్నాడని.. అందులో కార్వ చౌత్కు సంబంధించిన విషయం చెప్పలేదన్నారు. అయితే, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖను చూశానని.. దానిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. నోటీసులకు సరైన స్పందన లేకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
'నా భార్య అలిగింది.. హోలీకి అత్తింటికి వెళ్లకపోతే అంతే'.. పోలీసు రాసిన లీవ్ లెటర్ వైరల్
అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఇలాంటి తరహా ఘటనే జరిగింది. గత 22ఏళ్లుగా తన భార్యను హోలీకి తన పుట్టింటికి తీసుకువెళ్లనందుకు అలిగిందని.. ఆమెను శాంతపరచాలంటే 10రోజులు సెలవు కావాలని పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ లేఖ రాశారు. ఫరూఖాబాద్‌లోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్.. సెలవు కోరుతూ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మీనాకు లేఖ రాశారు. 'పోలీసు ఉద్యోగం కారణంగా ఇన్స్పెక్టర్కు సెలవులు దొరకడం లేదు. వివాహమైన 22 ఏళ్ల నుంచి తన భార్యను హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లలేదు. అందుకే ఆమె తనపై కోపంగా ఉంది. ఆమెను శాంతింప చేయడానికి హోలీకి 10రోజులు సెలవు కావాలి' అని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన రాసిన లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'నా భార్య అలిగింది.. ఫోన్ చేసినా మాట్లాడడం లేదు.. లీవ్ కావాలి'.. ASPకి కానిస్టేబుల్ లేఖ
'భార్య నాపై అలిగింది.. 3 రోజులు లీవ్ ఇవ్వండి ప్లీజ్'.. క్లర్క్ లెటర్ వైరల్