ETV Bharat / bharat

బంగాల్​ ఆరో విడత ఎన్నికల ప్రచారానికి తెర

author img

By

Published : Apr 19, 2021, 8:12 PM IST

బంగాల్​లో ఈ నెల 22న జరగనున్న ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 43 స్థానాల్లో ఓటింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది.

Bengal Polls 2021
బంగాల్​ ఎన్నికలు

బంగాల్​లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది. 43 అసెంబ్లీ స్థానాల్లో.. ఈ నెల 22న(గురువారం) ఓటింగ్​ జరగనుంది. రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఈ మేరకు ఓటింగ్​కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. అంతకుముందున్న నిబంధనల ప్రకారం.. పోలింగ్​ తేదీకి 48 గంటల ముందువరకు ప్రచారం నిర్వహించేందుకు వీలుండేది. చివరి మూడు దఫాల ఓటింగ్​కూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈసీ స్పష్టం చేసింది.

ఉత్తర 24 పరగణాలు-17, నదియా-9, ఉత్తర్​ దినాజ్​పుర్​-9, పూర్వ బర్ధామన్​-8 స్థానాలకు గానూ... 14,480 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 1.03 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. 306 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్​ రాయ్​, తృణమూల్​ కాంగ్రెస్​(టీఎంసీ) సీనియర్​ నేతలు జ్యోతిప్రియ మల్లిక్​, చంద్రిమ భట్టాచార్య, సీపీఐ(ఎం) తరఫున తన్మయ్​ భట్టాచార్య ఉన్నారు. వీరితో పాటు టీఎంసీ తరఫున బరిలోకి దిగనున్న సినీ దర్శకుడు రాజ్​ చక్రవర్తి, నటి కౌషాని ముఖర్జీల భవితవ్యమూ ఇందులో తేలనుంది.

294 సీట్లున్న బంగాల్​లో.. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్​ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

ఇదీ చదవండి: 'చేతులు జోడించి అడుగుతున్నా.. పోలింగ్​ కుదించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.