దిల్లీ నిరసనల్లో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌కు చెందిన నవ్‌జోత్ అనే 18ఏళ్ల యువ కర్షకుడు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో నిరసనలు మొదలైన గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు 18 మంది అన్నదాతలు మరణించినట్టు నివేదికలు వెల్లడించాయి.
పాటియాలకు చెందిన నవ్‌జోత్.. ఈ నెల 22 నుంచి రైతు ఉద్యమంలో చేరి, సింఘు సరిహద్దు వద్ద నిరసనల్లో పాల్గొంటున్నారు. అయితే.. ఆకస్మికంగా గుండుపోటు రావడం వల్ల ఆయన మృతిచెందాడని సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
నవ్‌జోత్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి రైతు సంఘాలు. మృతుని కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: పంట నష్టం... దేశానికి ఎంతో కష్టం!