ETV Bharat / bharat

మైనర్​పై​ గ్యాంగ్​రేప్​- 8 మంది నిందితులు అరెస్ట్​ - గ్యాంగ్​రేప్​ కేసులో 8 మంది అరెస్ట్​

పుణె గ్యాంగ్​రేప్​ కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్​ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు రైల్వే సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

gang-raping minor girl in Pune
మైనర్​పై​ గ్యాంగ్​రేప్
author img

By

Published : Sep 7, 2021, 6:08 AM IST

Updated : Sep 7, 2021, 6:37 AM IST

మైనర్​ గ్యాంగ్​రేప్​ కేసులో పుణె పోలీసులు 8 మందిని అరెస్ట్​ చేశారు. వీరిలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు రైల్వే సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 31న రాత్రి పుణె రైల్వే స్టేషన్​ నుంచి బాలికను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పేర్కొన్నారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారు.

బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తొలుతగా కిడ్నాప్ కేసు నమోదు చేశారని అధికారులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై బాలిక వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిటీ కమిషనర్​ నమ్రతా పాటిల్​ వివరించారు.

ఇదీ జరిగింది..

గత నెల 31వ తేదీన ఓ బాలిక తన మిత్రుల కోసమని పూణె రైల్వే స్టేషన్​కు చేరుకుంది. అక్కడ వారు లేరు. దీంతో తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఓ ఆటో డ్రైవర్​ ఇంటి దగ్గర వదిలిపెడుతానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన అమ్మాయి ఆటో ఎక్కింది. అక్కడ నుంచి అతను ఓ తెలియని ప్రదేశానికి తీసుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ బాలికను పుణె, ముంబయిలోని వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అదుపులోకి తీసుకున్న 8 మంది నిందితులను కస్టడీకి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..!

Last Updated : Sep 7, 2021, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.