బంగాల్‌కు చెందిన రోజ్ వ్యాలీ గ్రూప్, వారి ప్రమోటర్లతో సహా మరో రెండు కంపెనీలు రూ.155 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ గ్రూప్‌లు పోంజీ విధానం ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు పేర్కొంది. బాసిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రోజ్ వ్యాలీ గ్రూపులపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
బాసిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, రోజ్ వ్యాలీ గ్రూప్‌లపై మనీలాండరింగ్ కింద కేసు దర్యాప్తు చేపట్టాము. ఈ కంపెనీలు వివిధ నకిలీ పథకాలతో ప్రజలను మోసం చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశాయని ఆరోపణలు ఉన్నాయి. వారు తిరిగి చెల్లించమంటే చేతులెత్తేశారని తేలింది.
- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
ఈ గ్రూప్‌ల వారు ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన నిధులను దారి మళ్లించారని దర్యాప్తులో తేలింది. త్రిపుర, అసోం,బంగాల్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వివిధ కంపెనీల పేరిట అనేక ఆస్తులను బాసిల్ గ్రూప్, రోజ్ వ్యాలీ గ్రూప్ కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పోంజీ స్కాం: రోజ్ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్