ETV Bharat / bharat

ఇసుక తవ్వకాల కేసులో.. మాజీ సీఎం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! - ED summoned Former Punjab Chief Minister Charanjit Singh Channi

ED grills Channi: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రశ్నించింది. సుమారు ఆరు గంటల విచారణ అనంతరం.. బుధవారం రాత్రి ఈడీ కార్యాలయం నుంచి చన్నీని తిరిగి పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ED grills former Punjab CM Channi
ED grills former Punjab CM Channi
author img

By

Published : Apr 14, 2022, 5:24 PM IST

ED grills Channi: పంజాబ్​ మాజీ సీఎం, కాంగ్రెస్​ నేత చరణ్​జిత్​ సింగ్​ చన్నీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి మనీ లాండరింగ్​ కేసు విచారణలో భాగంగా.. ఆయనను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రశ్నించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం(పీఎంఎల్​ఏ) కింద ​చన్నీ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 6 గంటలు ప్రశ్నించిన తర్వాత.. జలంధర్​లోని ఈడీ జోనల్​ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఆలస్యంగా చన్నీని తిరిగి పంపించినట్లు వెల్లడించారు.

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇదే కేసులో.. చన్నీ మేనల్లుడు భూపిందర్​ సింగ్​ హనీని ఈడీ అరెస్టు చేసింది. హనీ సహా మరికొందరిపై జలంధర్​లోని పీఎంఎల్​ఏ ప్రత్యేక కోర్టులో మార్చి 31న ఛార్జిషీట్​ దాఖలైంది. ప్రస్తుతం జుడీషియల్​ కస్టడీలో ఉన్న చన్నీ మేనల్లుడు.. ఇటీవలే బెయిల్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేనల్లుడు హనీ, ఇతరులతో సంబంధాలు, సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన పలుమార్లు రావటంపై చన్నీని ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో భాగంగా.. పలువురు అధికారుల బదిలీలు, పోస్టింగ్​లకు సంబంధించిన ఆరోపణలపైనా చన్నీని ఆరా తీసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై చన్నీ ట్వీట్​ చేశారు. 'ఈడీ బుధవారం నాకు సమన్లు జారీ చేసింది. వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పా' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున పెద్దగా మాట్లాడదలచుకోలేదని అన్నారు. అధికారులు.. తనను మళ్లీ రావాలని ఏం అడగలేదని స్పష్టం చేశారు. ఇటీవల పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోరంగా ఓడిపోయింది. మార్చి 10న ఫలితాలు వెల్లడించిన కాసేపటికే చన్నీ.. సీఎం పదవికి రాజీనామా చేశారు. చన్నీ.. తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు.

చన్నీ ట్వీట్​

ఇవీ చూడండి: విద్యార్థుల మతమార్పిడికి యత్నం.. మహిళా టీచర్​ సస్పెండ్​

ప్రధాన మంత్రుల మ్యూజియం.. మోదీ స్వయంగా టికెట్​ కొని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.