ETV Bharat / bharat

రియల్​ ఎస్టేట్ కంపెనీలో మోసం.. రూ.56కోట్లు అటాచ్​

ఝార్ఖండ్​లోని సంజీవని బిల్డ్కా​న్​ రియల్​ ఎస్టేట్​ సంస్థకు సంబంధించి దాదాపు రూ.56 కోట్ల ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అటాచ్​ చేసింది.​ సదరు కంపెనీ మోసపూరిత ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి పెద్దఎత్తున రియల్​ మోసాలకు పాల్పడినట్లు తెలిపింది.

ED attaches 101 properties worth Rs 55.57 cr of Jharkhand real estate firm
రియల్​ ఎస్టేట్ కంపెనీలో మోసం.. రూ.56కోట్లు అటాచ్​
author img

By

Published : Mar 14, 2021, 12:24 PM IST

ఝార్ఖండ్​లోని ఓ ప్రముఖ రియల్​ ఎస్టేట్​ సంస్థ సంజీవని బిల్డ్​కాన్​ ప్రైవేట్​ లిమిటెడ్​(ఎస్​బీపీఎల్​)పై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ) కొరడా ఝుళిపించింది. సంస్థలో జరిగిన అక్రమ లావాదేవీలపై నమోదైన మనీలాండరింగ్​ కేసుకు సంబంధించి రూ.55.57కోట్ల విలువైన 101 ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది.

సంజీవని బిల్డ్​కాన్​పై అంతకుముందు సీబీఐ.. రాంచీలో ఎఫ్​ఐఆర్ నమోదుచేసింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే రూ.3.10కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది. ఈ సంస్థ​కు సంబంధించి రాంచీ, ఝార్ఖండ్​ సహా.. ఇతర ప్రాంతాల్లోని మూడు వాణిజ్య సముదాయాలపై ఏకకాలంలో దాడులు జరిపినట్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ డైరెక్టర్లు వారి బంధువుల బ్యాంకు ఖాతాలపైనా సోదాలు చేసినట్లు ఈడీ పేర్కొంది.

''ఓపెన్​ ప్లాట్లు, నిర్మించిన ఇళ్ల అమ్మకంపై వివిధ మీడియా ఛానెళ్లు, పత్రికా ప్రకటనల ద్వారా సంజీవని బిల్డ్​కాన్​ పెద్ద సంఖ్యలో ఝార్ఖండ్ ప్రజలను మోసం చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఫలితంగా పెట్టుబడిదారుల నుంచి కంపెనీకి చెక్కు, నగదు చెల్లింపులు భారీగా వచ్చి చేరాయి.''

-ఈడీ

అక్రమ లావాదేవీల కోసం కంపెనీ డైరెక్టర్లు సంస్థ పేరుతో, వ్యక్తిగతంగా పెద్ద సంఖ్యలో బ్యాంకు ఖాతాలను తెరిచారు. నేరపూరితంగా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం నిందితులు తమ వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని, నగదు రూపంలోనూ ఉపసంహరించుకున్నట్లు ఈడీ తెలిపింది.

ఇదీ చదవండి: అసోంలో రూ.31 కోట్ల నగదు, బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.