నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ఫలితాలు వెల్లడిపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి(శనివారం) ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 రాత్రి 7:30 గంటల వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాతం పుదుచ్చేరి సహా తమిళనాడు, కేరళ, బంగాల్, కేరళ రాష్ట్రాలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది.
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 సీట్లకు.. బంగాల్లో 294 స్థానాలకుగాను 30 సీట్లకు తొలిదశ పోలింగ్ నేడు జరగనుంది.
ఇదీ చూడండి:బంగాల్ దంగల్: తొలిదశలో 30 స్థానాలకు 191మంది పోటీ
ఇదీ చూడండి:అసోం తొలిదశకు సర్వం సిద్ధం- బరిలో ప్రముఖులు