ETV Bharat / bharat

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్

EC Implement New Policy to Postal Ballots : పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కంటే ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితోపాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకూ ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది.

EC Implement New Policy to Postal Ballots
EC Implement New Policy
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 6:06 AM IST

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త విధానం అమలు

EC Implement New Policy to Postal Ballots : ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది చాలా కీలకం. వారిలో చాలా మందికి సొంత ప్రాంతంలో నిధులు నిర్వహించే అవకాశం ఉండదు. దీంతో వారు తమ ఓటుహక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదు. వారి సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. తమ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్​ను తీసుకొని ఓటు వేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి శిక్షణా సమయంలోనే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను అందిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు ఉదయం ఎనిమిది గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పోస్టు ద్వారా వాటిని పంపాల్సి ఉండేది.

Election Commission Changes to Postal Ballots : అయితే పోస్టల్ బ్యాలెట్​ను సిబ్బంది తమ వద్దే ఉంచుకొని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్లు కలిగిన వారు ఒక్కో మారు ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి ఏర్పడింది. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఈసీ... ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇకనుంచి పోస్టల్ బ్యాలెట్లను తమ వద్దే అంటిపెట్టుకునే పరిస్థితి ఉండదు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారందరూ విధిగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడే బ్యాలెట్ తీసుకొని ఎన్నికల విధులకు వెళ్లే ముందే వారు తమ ఓటుహక్కు వినియోగించుకొని అక్కడే రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 13ఏ ఫారంపై సంతకం చేసి ఏగ్రూప్ లేదా బీగ్రూప్ అధికారి సమక్షంలో ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.

శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Postal Ballot Facility for Employees : సర్వీసు ఓటర్లుగా పరిగణించే త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ - ఈటీపీబీఎస్​ను వినియోగిస్తారు. సర్వీసు ఓటర్లు తమకు సంబంధించిన నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను ఈటీపీబీఎస్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బ్యాలెట్ పై తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా బ్యాలెట్ ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు.

అటు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో 13 కేటగిరీలకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని విస్తరించింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య-ఆరోగ్యశాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, పౌరసరఫరాలశాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ కవరేజ్ కోసం ఈసీఐ ధృవీకరించిన మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఈ జాబితాలో ఉన్నాయి.

Postal Ballot Facility in Telangana 2023 : ఈ శాఖలు, విభాగాలకు చెందిన వారు పోలింగ్ రోజు విధుల్లో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వర్తిస్తుంది. ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే వారు 12డీ ఫారంలో వివరాలు పొందుపర్చి నోడల్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. నోడల్ అధికారి వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పంపిస్తారు. ఈ తరహాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనుకునే వారి ఫారం 12 డీ పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరాల్సి ఉంటుంది. వాటిని ఆర్ఓ పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు.

Telangana Assembly Election Arrangements 2023 : నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం.. పోలింగ్ ఏర్పాట్లపై ఆరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.