బంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయ వేడుక్కుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులపై స్పందించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోడా. డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని అరోడా స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పౌర పోలీసు వలంటీర్లను నియమించబోమని పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లోని ఓటర్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) బెదిరిస్తోందని ఓ రాజకీయ పార్టీ(టీఎంసీ) ఆరోపించడం దురదృష్టకరం అని అరోడా అన్నారు. బీఎస్ఎఫ్ దేశంలోనే ఉత్తమమైన దళాల్లో ఒకటిని పేర్కొన్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు తీసుకురావాలన్నారు.
రాజకీయ పార్టీలు వ్యాప్తి చేస్తున్న సమాచారంలో ఏమైనా అసత్యాలు ఉంటే పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులను ఈసీ కోరింది.
ఇదీ చూడండి: ఈసీకి భాజపా, టీఎంసీ పోటాపోటీ ఫిర్యాదులు