ETV Bharat / bharat

ఎన్నికల ప్రచార సభలకు ఈసీ ఓకే.. షరతులు వర్తిస్తాయ్​! - రోడ్డు షోలపై నిషేధం విధించిన కేంద్ర ఎన్నికల సంఘం

Assembly elections EC new rules: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కల్పించింది. ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతించింది. అయితే.. రోడ్​షోలు, పాదయాత్రలు, ఊరేగింపులపై విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

EC grants relaxation for physical public meetings
'బహిరంగ సమావేశాలకు ఓకే.. కానీ షరతులు వర్తిస్తాయి'
author img

By

Published : Feb 6, 2022, 1:20 PM IST

Assembly elections EC new rules: కరోనా ఉద్దృతి కొనసాగుతున్న క్రమంలో.. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం కాస్త ఊరటనిచ్చింది. బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. గతంలో విధించిన నిషేధం రోడ్ షోలు, పాదయాత్రలు, సైకిల్​, బైక్, వాహనాల ర్యాలీలు, ఊరేగింపులకు వర్తిస్తుందని పేర్కొంది.

"ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండోర్​ సమావేశాలు నిర్వహించాలంటే.. ఆ హాలు సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. ఓపెన్​ గ్రౌండ్​లో అయితే 30 శాతం మందితో మాత్రమే సమావేశం నిర్వహించాలి. బహిరంగ సభల్లో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి."

- కేంద్ర ఎన్నికల సంఘం

గతంలో మాదిరిగానే... పాదయాత్రలు, సైకిల్​, బైక్​, వాహనాల ర్యాలీలపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. అలానే ఇంటింటి ప్రచారానికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే చేయాలని సూచించింది.

అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలు కొనసాగింపుపై చర్యలు కొనసాగించాలని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది ఈసీ. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వారి నుంచి నివేదికలు తెప్పించుకున్న ఈసీ.. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేసింది. పాజిటివిటీ రేటు తగ్గినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:

యూపీ తొలిదశ ఎన్నికల్లో 15 మంది నిరక్షరాస్యులు

Punjab congress: సీఎం అభ్యర్థి తేలినా.. సిగపట్లు ఆగేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.