ETV Bharat / bharat

ఎన్నికల్లో బైక్​ ర్యాలీలపై ఈసీ కీలక నిర్ణయం - బైక్​ ర్యాలీల్లో సంఘ విద్రోహ శక్తులు

నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్​కు 72 గంటల మందు బైక్​ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.

ec bans rallys in poll going seats
72 గంటల మందు బైక్​ ర్యాలీలు బంద్​
author img

By

Published : Mar 22, 2021, 4:08 PM IST

వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో పోలింగ్​కు 72 గంటల ముందు బైక్​ ర్యాలీలు నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓటర్లను బెదిరించడానికి మోటార్​ బైకులను సంఘ విద్రోహ శక్తులు వినియోగిస్తాయన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, బంగాల్​లోని ఎన్నికల ప్రధాన అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిబంధనల గురించి అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు, ఎన్నికల పరిశీలకులకు తెలియజేయాలని అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఐదు అసెంబ్లీలకు మార్చి 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మే 2న ఓట్లను లెక్కించనున్నారు.

ఇదీ చూడండి:'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్​తో అంధకారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.