ETV Bharat / bharat

రెండు డోసులు తీసుకున్నారా..? అయితే ఈ 'ఫుడ్'​ ఆఫర్​ మీకే! - 100 కోట్ల టీకా మార్కును దాటిన భారత్​

భారత్​ టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును (100 Crore Vaccine) చేరుకున్నందుకు గానూ మోహిత్​ అనే ఓ చిరుతిళ్ల వ్యాపారి స్థానికులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ పూర్తయిన వారు తన షాప్​కు వస్తే గుజరాత్​లోని సంప్రదాయ వంటకమైన 'లోచో'ను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.

hop owner in Surat gave free 'locho' to 100 fully vaccinated
బంపర్​ ఆఫర్​
author img

By

Published : Oct 22, 2021, 2:07 PM IST

Updated : Oct 22, 2021, 4:36 PM IST

రెండు డోసులు పూర్తి చేసుకున్న మొదటి 100 మందికి ఉచితంగా ఫుడ్​

దేశంలో టీకా పంపిణీ 100కోట్ల మార్కును (100 Crore Vaccine) దాటింది. ఈ నేపథ్యంలో గుజరాత్​ సూరత్​కు చెందిన ఓ చిరుతిళ్ల వ్యాపారి కస్టమర్లకు మంచి ఆఫర్​ ఇచ్చారు. స్థానిక వంటకమైన 'లోచో'ను.. రెండు డోసులు పూర్తి చేసుకున్న మొదటి 100 మందికి ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్​ను మరో రెండు రోజుల పాటు కొనసాగిస్తానని తెలిపారు.

hop owner in Surat gave free 'locho' to 100 fully vaccinated
రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువపత్రం చూపిస్తున్న వినియోగదారుడు

"భారత్​లో టీకా పంపిణీ 100 కోట్ల మార్కును దాటింది. ఇందులో ప్రజల భాగస్వామ్యమే ప్రధానం. అందుకే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న వారికి నా దుకాణంలో చేసే లోచోను ఉచితంగా ఇస్తున్నాను. ఈ ఆఫర్​ మరో రెండు రోజుల వరకు ఉంటుంది. మొదటి వంద మందికే ఈ ఆఫర్​ వర్తిస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రజల్లో టీకాపై అవగాహన మరింత పెరగుతుందని భావిస్తున్నాను."

-మోహిత్​, దుకాణాదారుడు

విదేశాల్లో టీకాపై అవగాహన కల్పించేందుకు అక్కడి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు నగదు ప్రోత్సాహాన్ని, డిస్కౌంట్లను, ఆఫర్లను ఇస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్​ ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన రెండో దేశంగా ఉన్న భారత్​లో ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. టీకా వేసుకుంటే.. ఎఫ్​డీలపై అధిక వడ్డీని చెల్లించనున్నట్లు అనేక బ్యాంకులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్​కు చెందిన మోహిత్​ అనే చిరుతిళ్ల వ్యాపారి తనకు తోచిన విధంగా ఈ ఫూడ్​ ఆఫర్లను ప్రకటించారు.

రెండు డోసులు పూర్తయిన వినియోగదారులు

దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంగా 100కోట్ల మైలురాయిని అందుకుంది. గురువారం ఈ ఘనత సాధించింది.

ఆఫర్​ను వినియోగించుకుంటున్న వినియోగదారులు

ఇదీ చూడండి: 'టీకా వంద కోట్ల మైలురాయి.. నవభారతానికి ప్రతీక'

Last Updated : Oct 22, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.