ETV Bharat / bharat

'బీఫ్​ తినండి..' భాజపా మంత్రి పిలుపు - హిమంత బిశ్వ శర్మ

గో వధ, బీఫ్​ను అనాదిగా వ్యతిరేకిస్తూ వస్తోంది భాజపా. ఇప్పటికే భాజపా పాలిత రాష్ట్రాల్లో అనేక చట్టాలతో వాటిని నిషేధించాయి. అయితే తాజాగా ఓ భాజపా మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'బీఫ్ తినండి'​ అంటూ ఆయన ప్రజలను ప్రోత్సహించారు.

BJP minister beef
బీఫ్
author img

By

Published : Jul 31, 2021, 9:29 PM IST

'బీఫ్​ తినండి..' అంటూ ఓ భాజపా మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భాజపా సిద్ధాంతాలకు ఈ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా.. ఇందుకు ఆయన ఇచ్చిన వివరణ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

'చికెన్​.. మటన్​.. వద్దు'

మేఘాలయ కేబినెట్​లో గత వారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శాన్బోర్ షుల్లాయ్.. ఇది ప్రజాస్వామ్య దేశమని.. అందువల్ల ఎవరికి నచ్చింది వారు తినే స్వేచ్ఛ ఉందని తెలిపారు. అయితే చికెన్​, మటన్​, ఫిష్​ బదులు బీఫ్​ తినాలని ప్రోత్సహించారు.

BJP minister beef
శాన్బోర్ షుల్లాయ్

"చికెన్​, మటన్​, ఫిష్​ బదులు బీఫ్​ తినాలని నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఇలా చేస్తే.. గో వధపై భాజపా నిషేధం విధిస్తుందన్న భావన తొలిగిపోతుంది."

-- శాన్బోర్​ షుల్లాయ్​, మేఘాలయ మంత్రి

పశుసంవర్ధకశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు షుల్లాయ్​. అసోంలో తీసుకొచ్చిన నూతన గో చట్టం నేపథ్యంలో మేఘాలయకు పశు రవాణా దెబ్బతినకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో చర్చిస్తానని హామీనిచ్చారు.

ఈ క్రమంలో అసోం- మేఘాలయ సరిహద్దు వివాదంపైనా స్పందించారు షుల్లాయ్​. అసోం వాసులు తమ ప్రజలను హింసిస్తే.. ఇక అక్కడిక్కడే సమాధానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే తాను హింసను ప్రొత్సహించడం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'బీఫ్​ తినొద్దని చెప్పడానికి మీరెవరు ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.