Earthquake In Tamil Nadu : దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలోనే నాలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. అటు గుజరాత్, మేఘాలయతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో కూడా భూప్రకంప కేంద్రాలను గుర్తించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో శుక్రవారం ఉదయం 7:39 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
-
Earthquake of magnitude 3.2 hit Chengalpattu, #TamilNadu at about 7:39 am: National Center for Seismology @NCS_Earthquake #Earthquake pic.twitter.com/Cq84i0mMJm
— Press Trust of India (@PTI_News) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Earthquake of magnitude 3.2 hit Chengalpattu, #TamilNadu at about 7:39 am: National Center for Seismology @NCS_Earthquake #Earthquake pic.twitter.com/Cq84i0mMJm
— Press Trust of India (@PTI_News) December 8, 2023Earthquake of magnitude 3.2 hit Chengalpattu, #TamilNadu at about 7:39 am: National Center for Seismology @NCS_Earthquake #Earthquake pic.twitter.com/Cq84i0mMJm
— Press Trust of India (@PTI_News) December 8, 2023
తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు దాని పరిసర ప్రాంతాలైన విన్నమంగళం, పెరియాంకుప్పం, చందోర్‌కుప్పం, కరుంబూరు, అలంకుప్పం, పాలూరుతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 7.40 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కూడా శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించందని చెప్పింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ.
-
An earthquake with a magnitude of 3.9 on the Richter Scale hit Kachchh, Gujarat today at 9 am: National Center for Seismology (NCS) pic.twitter.com/yPnXSChr95
— ANI (@ANI) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">An earthquake with a magnitude of 3.9 on the Richter Scale hit Kachchh, Gujarat today at 9 am: National Center for Seismology (NCS) pic.twitter.com/yPnXSChr95
— ANI (@ANI) December 8, 2023An earthquake with a magnitude of 3.9 on the Richter Scale hit Kachchh, Gujarat today at 9 am: National Center for Seismology (NCS) pic.twitter.com/yPnXSChr95
— ANI (@ANI) December 8, 2023
కర్ణాటక, మేఘాలయాల్లోనూ భూప్రకంపనలు
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కూడా శుక్రవారం ఉదయం 8:46 గంటల సమయంలో 3.8 తీవ్రతతో భూమి కదిలిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. షిల్లాంగ్‌కు నైరుతి దిశలో ఉన్న మాఫ్‌లాంగ్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
-
Earthquake of magnitude 3.8 hit Shillong, Meghalaya at about 8:46 am: National Center for Seismology @NCS_Earthquake #earthquake pic.twitter.com/FMREn1N2yx
— Press Trust of India (@PTI_News) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Earthquake of magnitude 3.8 hit Shillong, Meghalaya at about 8:46 am: National Center for Seismology @NCS_Earthquake #earthquake pic.twitter.com/FMREn1N2yx
— Press Trust of India (@PTI_News) December 8, 2023Earthquake of magnitude 3.8 hit Shillong, Meghalaya at about 8:46 am: National Center for Seismology @NCS_Earthquake #earthquake pic.twitter.com/FMREn1N2yx
— Press Trust of India (@PTI_News) December 8, 2023
మరోవైపు కర్ణాటక విజయపుర జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా శుక్రవారం ఉదయం 6.52 గంటలకు భూక్రంపనలు సంభవించాయి. ఇక్కడ రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. జిల్లాలోని ఉకుమనల్ గ్రామానికి ఆగ్నేయ దిశలో 4.3 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఈ ప్రకంపనలు 40-50 కి.మీల వరకు సంభవించవచ్చని KSNDMC అధికారులు ప్రకటించారు. అయితే భూకంపం తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
Philippines Earthquake 2023 : కొద్దిరోజుల క్రితం ఫిలిప్పీన్స్‌లోని మిందానో ద్వీపకల్పంలో కూడా భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.5గా రికార్డైంది. సముద్ర మట్టానికి 32 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సెస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.