ETV Bharat / bharat

బ్లింకెన్​తో జైశంకర్ భేటీ- అమెరికా సాయానికి కృతజ్ఞత - అమెరికా విదేశాంగ మంత్రి భారత విదేశాంగ మంత్రి భేటీ

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​తో సమావేశమైనట్లు తెలిపారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. కరోనా కట్టడిలో భారత్​కు అమెరికా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు. కరోనా సవాళ్లతో పాటు.. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపు అంశం సమావేశంలో చర్చకు వచ్చిందని వెల్లడించారు.

EAM Jaishankar meeting with Anthony Blinken
బ్లింకెన్​తో జైశంకర్ భేటీ
author img

By

Published : May 4, 2021, 5:38 AM IST

జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహా వివిధ అంశాలపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితిపై సమాలోచనలు చేసినట్లు వివరించారు. కరోనా కట్టడిలో భారత్​కు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

"నా చిరకాల స్నేహితుడు ఆంటోనీ బ్లింకెన్​ను కలిసినందుకు సంతోషం. ప్రపంచవ్యాప్తంగా కరోనా సవాళ్లపై సవివరంగా చర్చించాం. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై దృష్టిసారించాం. విపత్కర పరిస్థితుల్లో అమెరికా అందించిన సహకారానికి కృతజ్ఞతలు. ఇండో పసిఫిక్​లో సమస్యలు, ఐరాస భద్రతా మండలి, మయన్మార్ అంశం, వాతావరణ సమస్యలు సైతం మా సమావేశంలో చర్చకు వచ్చాయి."

-ఎస్ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

జైశంకర్​తో భేటీపై స్పందించిన బ్లింకెన్.. కరోనాపై పోరులో ఇరుదేశాలు చేపట్టిన సంయుక్త చర్యలపై చర్చించినట్లు తెలిపారు. వ్యూహాత్మక మైత్రిని మరింత విస్తృతం చేయాల్సిన విషయంపై సమాలోచనలు చేసినట్లు చెప్పారు. అమెరికాకు భారత్ సన్నిహిత దేశమని, ఇరుదేశాల మధ్య ప్రత్యేక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

లండన్ వేదికగా జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతోంది. జీ7 శాశ్వత సభ్య దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్​ ఇందులో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాలు ఆతిథ్య దేశాలుగా హాజరవుతున్నాయి.

ఇదీ చదవండి: కొవిడ్​ మృతదేహాలను పీక్కు తిన్న శునకాలు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.