ETV Bharat / bharat

Drugs Smuggling Telangana 2023 : అంతు చిక్కని 'మత్తు' రహస్యం.. స్మగ్లర్లను పట్టుకునేందుకు అధికారుల నయా ప్లాన్ - ఈరోజు తెలంగాణ నేర వార్తలు

Drugs Smuggling Telangana 2023 : పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగలను.. పోలీసులకు చిక్కకుండా ఎలా స్మగ్లింగ్​ చేసేవారో చూశారు కదా. ఇప్పుడు గంజాయి, కొకైన్​ వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా అలాంటి పద్ధతులనే అవలంబిస్తున్నారు. కేవలం సరఫరాదారుడు మాత్రమే దొరుకుతాడు తప్ప.. దాని వెనక ఉన్న అసలు సూత్రధారి కనిపించడు. ఇంతకీ రాష్ట్రంలో ఏ విధంగా మత్తుమందుల వినియోగం పెరిగిందో తెలుసుకుందాం.

Narcotics Cases rise in  telangana
Narcotics Supplying on Rise in Telangana
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 1:09 PM IST

Drugs Smuggling Telangana 2023 : రాష్ట్రంలో మత్తుమందుల(Drugs Supply Telangana) వినియోగం విచ్చల విడిగా సాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారంటేనే.. ఈ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్తుమందుల సరఫరాను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన.. సరఫరాదారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎలాగైనా అరికట్టాలని చెప్పి.. తెలంగాణ నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో(టీన్యాబ్)ను ఏర్పాటు చేసింది. అయినా వీటి రవాణా తగ్గలేదు.

Drugs Smuggling Hyderabad 2023 : ఈ ఏడాదిలోనే టీన్యాబ్ దాదాపు రూ.50 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న సరకు అదనంగా ఉంది. డీఆర్​ఐ అధికారులు ఈ నెల 30న ఒక్కరోజే రూ.50 కోట్ల విలువైన కొకైన్(Cocaine)​ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా అన్ని నార్కొటిక్స్​ సంస్థ(Narcotics Organizations)లు కలిపి ఈ ఏడాది రూ.150 కోట్ల మత్తు పదార్థాలను పట్టుకున్నాయి. అయినా సరే సరఫరా గొలుసు మాత్రం తెగడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కేవలం సరఫరాదారులను పట్టుకున్నారు తప్ప.. సూత్రధారులను పట్టుకోలేకపోవడమే. అసలైన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు తమతమ వ్యూహాలను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పెద్ద ఎత్తున గంజాయి సీజ్​.. గూడ్స్​ ట్రక్కులో, ఇంట్లో 3వేల కిలోలకుపైనే..

Ganjayi Smuggling in Telangana 2023 : : ఈ ఏడాది టీన్యాబ్(TNAB)​ అధికారులు ఇప్పటివరకు 6 వేల కిలోల గంజాయి(Ganja)ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అయితే రాష్ట్రవ్యాప్తంగా 31వేల కిలోల పైచిలుకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్థానిక పోలీసులు, ఆబ్కారీ, డీఆర్​ఐ, నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో వంటివి దర్యాప్తులే దాదాపు 15 వేల కిలోలకు పైనే పట్టుకున్నారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్రంలో మత్తు పదార్థాల వినియోగంలో గంజాయిదే పైచేయి అని చెప్పవచ్చు.

గంజాయి రవాణాకు కేంద్ర బిందువు తెలంగాణ : గతంలో ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతంలో గంజాయి సాగు ఎక్కువగా జరిగేది. అందులో ముఖ్యంగా కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లాలలో ఎక్కువగా పండించేవారు. ఆ తర్వాత ఆబ్కారీ, పోలీసు శాఖల కృషితో తగ్గుముఖం పట్టింది. కానీ గంజాయి సాగులో ఆరితేరిన వారిలో.. ఇప్పుడు చాలా మంది రవాణాదారులుగా మారిపోయారు. దీంతో వీరితోనే తెలంగాణ రవాణాకు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. దేశంలో అత్యంత నాణ్యమైన గంజాయి కేవలం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మాత్రమే పండుతోంది. అక్కడి నుంచే హైదరాబాద్​, మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​, దిల్లీ, కర్ణాటక వంటి ప్రాంతాలకు తరలి వెళుతుంది. అక్కడి డిమాండ్​ ఎక్కువగా ఉండడం వల్ల రాష్ట్రంలో అదే స్థాయిలో పెరుగుతోంది.

Ganja Seize: జలాశయంలోకి దూసుకెళ్లిన స్కార్పియో.. 300 కిలోల గంజాయి సీజ్

Drug Supplying Increasing in Telangana : ఇప్పుడు మత్తు మందులు రవాణా చాలా పకడ్బందీగా సాగుతోంది. ఎందుకంటే సరఫరా చేసేవారు దొరికినా.. దాన్ని తీసుకునేవారు కానీ.. పంపిన వారు కానీ ఎవరో తెలియకుండా ఉండేలా అనేక జాగ్రత్తలు వహిస్తున్నారు. వారు చెప్పిన ప్రాంతాల్లో వాహనం నిలపాలని మాత్రమే.. డ్రైవర్​కు చెబుతారు. మళ్లీ ఆ వ్యక్తికి ఒకరిద్దరు మధ్యవర్తులను నియమిస్తారు. వీళ్లకు కూడా పూర్తి వివరాలు తెలియవు. దీంతో పోలీసులకు ఒకరు చిక్కితే.. ఇంకొకరిని రంగంలోకి దించుతారు స్మగ్లర్లు.

అయినా పోలీసులకు దొరికిన వారిని ఎన్ని రకాలుగా ప్రశ్నించిన అసలు నోరు కూడా మెదపలేని పరిస్థితి ఏర్పడింది. అదే అంతర్జాతీయ స్థాయిలో అయితే అమాయకులను ఎరవేసి.. వారికి తెలియకుండా మత్తు మందులు ఇచ్చి పంపుతున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విదేశీయులు పట్టుబడ్డా వారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించలేకపోయారు. దీంతో పోలీసులు కూడా రూట్​ మార్చి.. తమ వ్యూహాలను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు.

Ganja gang arrested in Cyberabad : సైబరాబాద్​లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

భద్రాద్రి కొత్తగూడెంలో 488 కేజీల గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.