ETV Bharat / bharat

రూ.1.5 కోట్లు విలువైన డ్రగ్స్​ పట్టివేత.. ఆఫ్రికన్​ అరెస్ట్​

Drug trafficking cases in India: బెంగళూరులో రూ.1.5 కోట్లు విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నారు ఎన్​సీబీ అధికారులు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ముంబయి నుంచి విదేశాలకు కొరియర్​ ద్వారా తరలించేందుకు వాహనంలో రహస్యంగా తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు.

Drug trafficking cases in India
రూ.1.5 కోట్లు విలువైన డ్రగ్స్​ పట్టివేత.
author img

By

Published : Dec 25, 2021, 10:47 AM IST

Drugs seized in Bangalore: అంతర్జాతీయ డ్రగ్స్​ ముఠాకు చెందిన ఆఫ్రికా వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్​ చేశారు మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్​సీబీ) అధికారులు. రూ.1.5 కోట్లు విలువైన సింథటిక్​ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

Drug trafficking cases in India
సీటు కవర్​లో డ్రగ్స్​

చెన్నై, బెంగళూరు జోనల్​ ఎన్​సీబీల నుంచి వచ్చిన సమాచారం మేరకు బెంజమిన్​ సండే అలియాస్​ ఆంటోనీ అనే వ్యక్తిని గత గురువారం పట్టుకున్నట్లు ఎన్​సీబీ బెంగళూరు జోనల్​ డైరెక్టర్​ అమిత్​ గవాటే శుక్రవారం తెలిపారు. నిందితుడి వద్ద 968 గ్రాముల అంఫెటమిన్​, 2.889 కిలోల ఎఫెడ్రిన్​​ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొరియర్​ ద్వారా విదేశాలకు తరలించేందుకు ముంబయి నుంచి ఈ మత్తు పదార్థాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Drug trafficking cases in India
సీటు కవర్​లో దాచిన డ్రగ్స్​
Drug trafficking cases in India
చెక్క బాక్సుల్లో దాచిన డ్రగ్స్​ను తీస్తున్న అధికారులు

" మూడు చెక్క బాక్సుల్లో ప్రత్యేకంగా రూపొందించిన బొరియల్లో ఈ మత్తుపదార్థాలను దాచారు. ఒక్కో బాక్సులో 165 గ్రాముల అంఫేటమిన్​, వాహనం సీటు వెనకాల రెండు చోట్ల 237 గ్రాములు, 236 గ్రాముల అంఫేటమిన్​, రెండు మెటల్​ గిరకల్లో 1.811 కిలోలు, 1.078 కిలోల ఎఫెడ్రిన్​లను దాచారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ. 1.5 కోట్లు ఉంటుంది. "

- అమిత్​ గవాటే, బెంగళూరు ఎన్​సీబీ జోనల్​ డైరెక్టర్​

బెంజమిన్​ చెన్నైకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడని, మత్తుపదార్థాల దిగుమతి, ఎగుమతిలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు డైరెక్టర్​. చెన్నైలో 2018, సెప్టెంబర్​లో పట్టుబడిన 113 గ్రాముల కొకైన్​, 2021, సెప్టెంబర్​లో దొరికిన 295 గ్రాముల మెతంఫెటమిన్ కేసుల్లో బెంజమిన్​ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. 2021, నవంబర్​లో ఆస్ట్రేలియాలో పట్టుబడిన 1359 గ్రాముల మెతంఫెటమిన్​ ​కేసులోనూ నిందితుడిగా చెప్పారు.

ఇదీ చూడండి: డీఐజీ భార్య పర్సు చోరీ.. బస్సులో ప్రయాణిస్తుండగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.