ETV Bharat / bharat

వరుడికి నిరసన సెగ- కాలినడకన వేదికకు... - farm bills protests

దిల్లీలో సరిహద్దుల్లో వాహనాలను పోలీసులు నిలిపేయగా.. మేరఠ్​లో ఓ పెళ్లికొడుకు కాలినడకన వివాహ వేదికకు చేరుకోవాల్సి వచ్చింది. పంజాబ్, హరియాణా రైతుల ఆందోళనల నేపథ్యంలో దిల్లీలోకి అన్ని ప్రవేశమార్గాలను మూసేయడం వల్ల ఇతర ప్రయాణికులూ ఇబ్బందులు పడుతున్నారు.

farm briller
వ్యవసాయం
author img

By

Published : Nov 27, 2020, 2:28 PM IST

పంజాబ్, హరియాణా రైతుల ఆందోళనలతో దిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఛలో దిల్లీ పేరిట రైతులు చేపట్టిన ర్యాలీని నగరంలోకి రానీయకుండా అన్ని ప్రవేశ మార్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. ఫలితంగా సాధారణ ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాలినడకన ప్రయాణికులు

కాలినడకన వరుడు..

మేరఠ్​లో వివాహ వేదిక చేరుకోవాల్సిన ఓ వరుడు.. దిల్లీ సరిహద్దుల్లో చిక్కుకుపోయాడు. వేరే మార్గం లేక కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి మేరఠ్​కు చేరుకున్నాడు.

farm briller
పెళ్లి బృందం పాదయాత్ర
farm briller
నడుచుకుంటూ వెళుతున్న పెళ్లి కొడుకు

ప్రయాణికుల ఇబ్బందులు..

దిల్లీకి వస్తోన్న ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసుల అనుమతితో కాలినడకన నగరంలోకి వస్తున్నారు.

farm briller
రైతుల నిరసన

రైతులను జైళ్లకు పంపలేం..

దిల్లీలోని 9 స్టేడియాలను జైళ్లుగా వాడుకుంటామన్న నగర పోలీసుల అభ్యర్థనను కేజ్రీవాల్​ ప్రభుత్వం తిరస్కరించింది. రైతులను జైళ్లకు పంపేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు దిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

farm briller
సరిహద్దుల్లో పోలీసులు..

ఇదీ చూడండి: రైతుల 'ఛలో దిల్లీ' మార్చ్​లో​ మరోసారి ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.