ETV Bharat / bharat

మెట్రో ట్రాక్​పై పడిపోయిన డ్రోన్.. ఆగిన సేవలు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్!

మెట్రో రైల్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. ఓ డ్రోన్.. ట్రాక్​పై పడిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి.

drone-fell-on-metro-track
drone-fell-on-metro-track
author img

By

Published : Dec 25, 2022, 6:02 PM IST

మెట్రో రైలు కార్యకలాపాలకు ఓ డ్రోన్ ఆటంకం కలిగించింది. ఔషధాలు సరఫరా చేస్తున్న డ్రోన్.. మెట్రో ట్రాక్​పై పడిపోయింది. దిల్లీలో ఈ ఘటన జరిగింది. ఫలితంగా జసోలా విహార్, షహీన్ బాగ్​ నుంచి బొటానికల్ గార్డెన్ వైపునకు వెళ్లే మెట్రో రైళ్లు కొద్దిసేపు ఆగిపోయాయి. భద్రతా కారణాల వల్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.

drone-fell-on-metro-track
రైల్వే ట్రాక్​పై డ్రోన్

మజెంట (ఎనిమిదో నంబర్) లైన్​లో సర్వీసులు ఆగిపోయినట్లు మధ్యాహ్నం 2.50 గంటలకు దిల్లీ మెట్రో రైల్ ట్వీట్ చేసింది. భద్రతా కారణాల వల్ల సర్వీసులు ఆగిపోయాయని తెలిపింది. మిగతా లైన్లలో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది. సర్వీసులు పునఃప్రారంభమైనట్లు 3.42 గంటలకు అప్డేట్ ఇచ్చింది మెట్రో. దీనిపై దిల్లీ పోలీసులు సైతం స్పందించారు. ప్రస్తుతం సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

drone-fell-on-metro-track
దిల్లీ మెట్రో ట్వీట్లు

"మెట్రో ట్రాక్ వద్ద డ్రోన్ కనిపించిందని మాకు 2.35 గంటలకు సమాచారం అందింది. డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. డ్రోన్​లో ఔషధాలు కనిపించాయి. ఆ డ్రోన్.. నొయిడాకు చెందిన ఓ సంస్థదని తేలింది. ఆ కంపెనీ డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా చేస్తుంది. వారికి డీజీసీఏ అనుమతి ఉందో లేదో అని పరిశీలిస్తున్నాం. డ్రోన్ డాక్యుమెంట్లను చెక్ చేస్తున్నాం. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం."
-జే మణి, మెట్రో డీసీపీ

దిల్లీ మెట్రో శనివారమే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002లో అప్పటి ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. కేవలం ఆరు స్టేషన్లతో ప్రారంభమైన దిల్లీ మెట్రో.. ప్రస్తుతం 286 స్టేషన్లకు విస్తరించింది. ప్రతిరోజు సుమారు 50 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. రెడ్, గ్రీన్, బ్లూ, పింక్, మజెంట సహా ఎనిమిది లైన్లు ఉన్నాయి. ఈ మెట్రో ప్రారంభించిన తర్వాత వాజ్​పేయీ అందులో ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటో గ్యాలరీ కోసం లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.