DRDO Jobs 2023 : రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)లో చేరాలనుకునేవారికి ఆ సంస్థ గుడ్‌న్యూస్ తెలిపింది. ఖాళీగా ఉన్న 12 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డీఆర్డీఓ రిక్రూట్‌మెంట్ 2023 పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డీఆర్డీఓ 12 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు NMRL ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 3 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ పనితీరు బాగుంటే సర్వీస్‌ను పొడిగించే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్‌లో పొందుపర్చారు.
- పోస్టులు, ఖాళీల వివరాలు..
- ప్రాజెక్టు సైంటిస్ట్ D- 04 పోస్టులు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ C- 03 పోస్టులు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ B- 02 పోస్టులు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ E- 02 పోస్టులు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్ F- 01 పోస్టులు
వయో పరిమితి
DRDO Jobs : ప్రాజెక్ట్ సైంటిస్ట్ F పోస్టులకు వయో పరిమితి ఈ ఏడాది జూన్ 16 నాటికి 55 సంవత్సరాలోపు ఉండాలి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ E పోస్టులకు 50 సంవత్సరాలలోపు, D పోస్టులకు 45 సంవత్సరాలలోపు, సీ పోస్టులకు 40 సంవత్సరాలలోపు, బీ పోస్టులకు 35 సంవత్సరాలలోపు కలిగి ఉండాలి.
విద్యార్హతలు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ B, C పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమిస్ట్రీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. మిగతా పోస్టులకు కనీసం ఫస్ట్ క్లాస్ ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి.
దరఖాస్తు వివరాలు
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. జూన్ 16 సాయంత్రం 4 గంటల వరకు సమయం ఇచ్చారు. దరఖాస్తు చేసుకునేందుకు https://rac.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఎంపికైన వారికి 3 సంవత్సరాల వరకు ఉద్యోగం ఉంటుంది. సంస్థ అవసరాలు, ఉద్యోగుల పనితీరును బట్టి సర్వీసును పొడిగించవచ్చు.
జీతభత్యాలు
DRDO Jobs Salary : ప్రాజెక్ట్ సైంటిస్ట్ F ఉద్యోగులకు రూ.2,20,717, ప్రాజెక్ట్ సైంటిస్ట్ E ఉద్యోగులకు రూ.2,01,794, ప్రాజెక్ట్ సైంటిస్ట్ D ఉద్యోగులకు రూ.1,24,612, ప్రాజెక్ట్ సైంటిస్ట్ C ఉద్యోగులకు రూ.1,08,073, ప్రాజెక్ట్ సైంటిస్ట్ B ఉద్యోగులకు రూ.90,789 ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
How To Apply DRDO Exam : జనరల్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు సమర్పించే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత మార్చుకునే వెసులుబాటు ఉండదు.
ఎంపిక విధానం
How To Apply DRDO : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూల కోసం అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి కనీసం ఇంటర్వ్యూలో 70 శాతం మార్కులు అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.