ETV Bharat / bharat

భారత్​లో స్పుత్నిక్​-వీ టీకా ట్రయల్స్​ షురూ

author img

By

Published : Dec 1, 2020, 7:23 PM IST

రష్యా రూపొందించిన స్పుత్నిక్​-వీ టీకా క్లినికల్​ ట్రయల్స్​ భారత్​లో ప్రారంభమయ్యాయి. డా. రెడ్డీస్​, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి సంయుక్తంగా ఈ ప్రయోగాలు చేపట్టాయి.

Dr.Reddy's,RDIF commence clinical trials for Sputnik V vaccine in India
భారత్​లో స్పుత్నిక్​-వీ ట్రయల్స్​ షురూ

భారత్​లో.. రష్యా కరోనా టీకా స్పుత్నిక్​-వీ 2,3 దశల క్లీనికల్​ ట్రయల్స్​ ప్రారంభమయ్యాయి. సెంట్రల్​ డ్రగ్స్​ ల్యాబొరేటరీ నుంచి కావాల్సిన అనుమతులు పొందిన నేపథ్యంలో హిమాచల్​ ప్రదేశ్​లోని కాసౌలిలో ఈ ట్రయల్స్​ చేపట్టినట్టు డా. రెడ్డీస్​ ల్యాబొరేటరీ, ఆర్​డీఐఎఫ్​(రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి) ఓ ప్రకటనలో వెల్లడించాయి.

జేఎస్​ఎస్​ మెడికల్​ రీసర్చ్​ సభ్యులు ఈ క్లినికల్​ ట్రయల్స్​ను నిర్వహిస్తున్నారు. టీకా భద్రత సహా ఇతర ముఖ్య అంశాలపై ఇక్కడ అధ్యయనం జరుగుతుందని డా. రెడ్డీస్​ వెల్లడించింది.

మరోవైపు కీలక సూచనలు, క్లినికల్​ ట్రయల్స్​ కేంద్రాల కోసం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బీఐఆర్​ఏసీ(బయోటెక్నాలజీ ఇండస్ట్రి రీసర్చ్​ అసిస్టెన్స్​ కౌన్సిల్​)ను భాగస్వామిగా చేర్చుకున్నట్టు డా. రెడ్డీస్​ ప్రకటించింది.

ఇటీవలే ప్రకటించిన టీకా ఫలితాల్లో.. తొలి డోసు ఇచ్చిన 28 రోజులకు తమ వ్యాక్సిన్​ 91.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆర్​డీఐఎఫ్​ తెలిపింది. అదే 42 రోజుల తర్వాత.. 95శాతం ప్రభావవంతంగా ఉందని పేర్కొంది.

ఇదీ చూడండి:- భారత్​లో 10 కోట్ల స్పుత్నిక్​-వీ టీకాల ఉత్పత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.