కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ కేంద్ర వైద్య శాఖ ఆందోళనకరమైన గణాంకాలను వెల్లడించింది. భారత్లో కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం గణనీయంగా తగ్గిందని పేర్కొంది. మార్చి 1న 504.4రోజులుగా ఉన్న రెట్టింపు సమయం(డబ్లింగ్ రేటు).. మార్చి 23 నాటికి 202.3 రోజులకు పడిపోయిందని తెలిపింది. రోజువారీ నూతన కేసుల్లో 80.90 శాతం ఆరు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని స్పష్టం చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- సోమవారం నమోదైన 40,715 కేసుల్లో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల వాటా 80.90 శాతం
- అత్యధికంగా మహారాష్ట్రలో 24,645(60.53శాతం) కేసులు, ఆ తర్వాతి స్థానంలో పంజాబ్(2,299), గుజరాత్(1,640) రాష్ట్రాలు.
- పది రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల గ్రాఫ్
- ఫిబ్రవరి మధ్యలో రికార్డు స్థాయి అత్యల్పం నమోదు తర్వాత.. క్రమంగా పెరుగుతున్న యాక్టివ్ కేసులు
- మంగళవారం నాటికి యాక్టివ్ కేసుల సంఖ్య 3.45 లక్షలకు చేరిక. 24 గంటల వ్యవధిలో సరాసరి 10,231 యాక్టివ్ కేసులు నమోదు
- మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాల వాటా 75.15 శాతం. ఒక్క మహారాష్ట్ర వాటానే 62.71 శాతం.
- కోలుకున్నవారి సంఖ్య 1,11,81,253కి చేరిక. 24 గంటల వ్యవధిలో కోలుకున్న 29,785 మంది బాధితులు.
మృతులు
- సోమవారం 199 మంది మృతి
- ఆరు రాష్ట్రాల్లోనే 80.4 శాతం మంది మృతులు.
- ఒక్క కరోనా మరణమైనా సంభవించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 14.
టీకా పంపిణీ
- మంగళవారం ఉదయం 7 గంటల నాటికి 4.8 కోట్ల(4,84,94,594) టీకా డోసుల పంపిణీ పూర్తి.
- 4 కోట్ల మార్క్ దాటిన తొలి డోసుల సంఖ్య
- మార్చి 22న 32,53,095 మందికి టీకా డోసుల పంపిణీ.