ETV Bharat / bharat

'సమాచార నిరాకరణపై కారణాలు చెప్పాల్సిందే' - సమాచార గోప్యతకు వివరణ ఇవ్వాలి!

సమాచారం ఇవ్వకపోవడానికి గల కారణాలను దరఖాస్తుదారుడికి తప్పకుండా వివరించాలని సీబీఐని కోరింది కేంద్ర సమాచార కమిషన్​. సమాచార హక్కు చట్టం కింద వస్తున్న దరఖాస్తులను సీబీఐ పలుమార్లు నిరాకరిస్తుండటంపై ఈ విధంగా స్పందించింది.

CIC_CBI
'సమాచార నిరాకరణపై స్పష్టత ఇవ్వాలి'
author img

By

Published : Nov 9, 2020, 6:13 PM IST

Updated : Nov 9, 2020, 6:36 PM IST

సమాచారం ఇచ్చేందుకు నిరాకరించడమే కాదు... ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు గల కారణాలను కూడా వివరించాలని సీబీఐకి సూచించింది కేంద్ర సమాచార కమిషన్. సీబీఐ దర్యాప్తు వివరాలు కోరుతూ.. ఓ వ్యక్తి వేసిన దరఖాస్తుపై ఈ విధంగా స్పందించింది. సమాచారం ఇవ్వడంలో దర్యాప్తు సంస్థకు ఎదురయ్యే సమస్యలేంటో స్పష్టంగా వివరించాకే దరఖాస్తును నిరాకరించాలని పేర్కొంది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్​ 8(1)(హెచ్) ఆధారంగా ఇప్పటికే పలు దరఖాస్తులను నిరాకరించింది సీబీఐ.

చెన్నై సంస్థ గురించి అడిగినందుకే!

చెన్నైలోని ఓ చిన్న, మధ్య తరహా పరిశ్రమపై సీబీఐ చేస్తోన్న దర్యాప్తు వివరాలు కావాలని ఓ పౌరుడు సమాచర హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు సీబీఐ నిరాకరించింది. దీంతో, దరఖాస్తుదారుడు కేంద్ర సమాచార కమిషన్​ను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో... దరఖాస్తుదారుడి వాదనలు విన్నారు సమాచార కమిషనర్ వనజ ఎన్ సర్నా.

" ఈ కేసుపై కేంద్ర పౌర సమాచార అధికారి దరఖాస్తు దారుడికి పూర్తి వివరణ ఇవ్వాలి. సమాచారం ఇవ్వకుండా సీబీఐ ఎందుకు నిరాకరించిందో స్పష్టత ఇవ్వాలి".

-వనజ ఎన్​ సర్నా, సమాచార కమిషనర్.

సెక్షన్ 8(1)(హెచ్) అంటే..

ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు కల్పిస్తుంది సమాచార హక్కు చట్టం. అయితే ఇందులో గోప్యత దృష్ట్యా కొన్ని మినహాయింపులున్నాయి. సెక్షన్ 8(1)(హెచ్) నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారులు గోప్యతకు భంగం కలిగే విషయాలను వెల్లడించరు. ఈ కారణం చూపి సీబీఐ పలుమార్లు పౌరులకు సమాచారం ఇవ్వడం నిరాకరించింది.

దిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చినా అదే బాటలో..

గతంలో.. ఓ​ కేసుకు సంబంధించి తీర్పు ఇచ్చిన దిల్లీ హైకోర్టు... సమాచారం ఇవ్వడానికి నిరాకరించడమే కాదు అందుకు గల కారణాలను సంబంధిత అధికారి కచ్చితంగా వివరించాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఇవ్వడం వల్ల వారికి ఎదురయ్యే సమస్యలేంటో చెప్పాలని తెలిపింది.

ఇదీ చదవండి:మధ్యప్రదేశ్​ 'ఉప' పోరులో గెలిచేది ఎవరు?

Last Updated : Nov 9, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.