ETV Bharat / bharat

సీఎంకు మద్దతుగా 60మంది ఎమ్మెల్యేల సంతకాలు - యడియూరప్ప ట్వీట్

కర్ణాటకలో అధికార భాజపా నాయకత్వ మార్పు కొలిక్కి రావడం లేదు. హై కమాండ్​ ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేస్తానని ఆదివారం యడియూరప్ప చెప్పిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సీఎం రాజకీయ కార్యదర్శి రేణుకాచార్య నేతృత్వంలో 60మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. దీనిపై స్పందించిన యడియూరప్ప.. సంతకాల సేకరణే కాదు.. బహిరంగంగా రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించరాదని సభ్యులను కోరారు.

karnataka CM, Yediyurappa
యడియూరప్ప, కర్ణాటక సీఎం
author img

By

Published : Jun 8, 2021, 7:55 AM IST

Updated : Jun 8, 2021, 9:25 AM IST

కర్ణాటకలో అధికార భాజపా నాయకత్వ మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. అధిష్ఠానం ఆదేశిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆదివారం యడియూరప్ప ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సీఎం రాజకీయ కార్యదర్శి రేణుకాచార్య నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. ముఖ్యమంత్రిని వ్యతిరేకించేవారు కూడా 20 మంది ఎమ్మెల్యేల సంతకాలను సేకరించినట్లు సమాచారం. సంతకాలను సేకరిస్తున్న సమయంలో యడియూరప్ప ట్విట్టర్‌లో స్పందించారు. సంతకాల సేకరణే కాదు.. బహిరంగంగా రాజకీయ అంశాలపై వ్యాఖ్యానించరాదని సభ్యులను కోరారు. ఎమ్మెల్యేలంతా కరోనా నియంత్రణపైనే దృష్టి సారించాలని సూచించారు. ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి మార్పు లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ స్పష్టం చేశారు. యడియూరప్పకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎందరో నేతలున్నారని సీఎం రేసులో ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇదే సమయంలో వ్యాఖ్యానించారు.

తొలుత 65 మంది మద్దతు..

కర్ణాటకలో నాయకత్వ మార్పునకు భాజపా యోచిస్తోందన్న ఊహాగాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు 65 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య సోమవారం వెల్లడించారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల గురించి తాను కర్ణాటక ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌తో చర్చించినట్లు తెలిపారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, భాజపా కర్ణాటక అధ్యక్షుడు నళిన్‌ కతీల్‌ సైతం నాయకత్వ మార్పు అంశాన్ని కొట్టిపారేశారని వివరించారు.

యడియూరప్పను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరే ఆలోచన పార్టీకి లేదని ప్రహ్లాద్‌ జోషి ఆదివారం హుబ్బళ్లిలో విలేకరుల సమక్షంలో స్పష్టం చేశారు. కొవిడ్‌ నియంత్రణపై మాత్రమే ప్రస్తుతం పార్టీ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను నళిన్‌ కతీల్‌ తోసిపుచ్చారు. ఏ స్థాయిలోనూ పార్టీ ఈ అంశంపై చర్చించలేదని మంగుళూరులో మీడియాకు తెలిపారు. పరిపాలనలో ఆయనకు అపార అనుభవం ఉందన్నారు. 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు.

అంతకుముందు యడియూరప్ప మాట్లాడుతూ.. "ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు పార్టీ ఇచ్చింది. దానిని నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి స్పందించను. పార్టీ ఆదేశిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం. రాష్ట్రంలో సమర్థులైన నాయకులు ఉన్నారు" అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

సీఎం మార్పు తప్పదా- పగ్గాలు ఎవరి చేతికి?

'హై కమాండ్​ చెబితే సీఎంగా తప్పుకుంటా'

Last Updated : Jun 8, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.