ETV Bharat / bharat

'రాజకీయాలకు 'కస్టమ్స్​'ను వాడుకుంటున్నారు'

భాజపా, కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు భాజపా, కాంగ్రెస్.. దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే అవి తమ ప్రభుత్వంపై దాడులు చేస్తున్నాయని ​మండిపడ్డారు.

Dollar smuggling case
'రాజకీయాలకు 'కస్టమ్స్​'ను వాడుకుంటున్నారు'
author img

By

Published : Mar 7, 2021, 9:26 AM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా, కాంగ్రెస్​ వాడుకుంటున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆరోపించారు. డాలర్​ స్మగ్లింగ్​ కేసులో తనతో పాటు, కొందరు రాష్ట్ర మంత్రుల ప్రమేయం ఉందంటూ కస్టమ్స్​ విభాగం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విజయన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్​ మానసిక పరిస్థితిని కస్టమ్స్​ అధికారులు ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైకోర్టుకు కస్టమ్స్ విభాగం సమర్పించిన పిటిషన్​.. రాజకీయ ప్రకటనలా ఉందని ఆరోపించారు.

"ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నాయి. అవి భాజపా, కాంగ్రెస్​ ఎజెండాను అమలు పరుస్తున్నాయి." అని అన్నారు. డాలర్​ స్మగ్లింగ్​ కేసులో సీఎం, మంత్రుల పేర్లను పేర్కొంటూ కస్టమ్స్ విభాగం వేసిన పిటిషన్​కు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్​ కార్యాలయాల ముందు లెఫ్ట్​ పార్టీలు ధర్నాలు చేశాయి. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్​ కేసులో అధికార పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్​ భార్య వినోదినికి కస్టమ్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. వారంలోపు విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొంది.

ఇదీ చూడండి:'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.