కేరళ మలప్పురంలోని ఎడక్కారాలో ఒక పెంపుడు శునకాన్ని ద్విచక్ర వాహనానికి కట్టి రోడ్డుపై లాక్కెళ్లిన క్రూర ఘటన చూపరులను కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వెనుక ఆటోలో వచ్చిన వ్యక్తులు కుక్కను లాక్కెళ్తున్న వ్యక్తిని బలవంతంగా ఆపి దాన్ని రక్షించారు. అప్పటికే కాళ్లకు తీవ్ర గాయాలై శునకం విలవిల్లాడిందని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనపై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు యజమానిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: చెరిగిపోతున్న చారిత్రక ఆనవాళ్లు