ETV Bharat / bharat

యాంటీబాడీలు లేకపోతే టీకా పనిచేస్తున్నట్టా? లేనట్టా?

కరోనా టీకా తీసుకున్న తర్వాత అసలు తమకు యాంటీబాడీలు వృద్ధి చెందాయో లేదోననే ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా వయసు పైబడ్డవారిలో ఈ ఆందోళన ఎక్కువగా ఉంటోంది. అయితే.. యాంటీబాడీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలా? ఒకవేళ పరీక్షల్లో యాంటీబాడీలు కనిపించకపోతే.. వ్యాక్సిన్ పని చేయట్టేనా? ఇలాంటి ప్రశ్నలకు నిపుణులు ఏం సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

antibodies after taking vaccine
వ్యాక్సన్​ తీసుకున్న వారిలో యాంటీబాడీలు
author img

By

Published : Aug 1, 2021, 8:49 AM IST

కొవిషీల్డ్‌ తీసుకున్నా తనకు యాంటీబాడీలు వృద్ధి చెందలేదని సీరం సంస్థ సీఈఓ అదర్‌ పూనావాలా, ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రతాప్‌ చంద్ర అనే వ్యక్తి లఖ్‌నవూలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సెరో సర్వేలో భాగంగా అహ్మదాబాద్‌లో టెస్టులు చేస్తే 81.63 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. అక్కడ ఇదివరకే కొవిడ్‌ సోకడం లేదా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఎక్కువమందికి యాంటీబాడీలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. పైగా కొవిడ్‌సోకిన వారిలోకంటే టీకాలు తీసుకున్నవారిలోనే యాంటీబాడీలు దీర్ఘకాలం పాటు ఉంటున్నాయని లఖ్‌నవూలోని కింగ్‌జార్జ్‌ మెడికల్‌ కళాశాల పరిశోధనలో వెల్లడైంది. ఇదిలా ఉంటే అసలు తమకు యాంటీబాడీలు వృద్ధి చెందాయో లేదోననే ఆందోళన చాలామందిలో, ముఖ్యంగా వయసు పైబడ్డవారిలో కనిపిస్తోంది. యాంటీబాడీ టెస్టులు అవసరమా? తగినంతగా యాంటీబాడీలు పరీక్షల్లో కనిపించకపోతే టీకాలు పనిచేయనట్టేనా?

యాంటీబాడీలను కనుక్కోవడం ఎలా?

యాంటీబాడీ పరీక్షలో సిరల నుంచి రక్తం తీసుకుంటారు. వైరస్‌కు ప్రతిస్పందనగా శరీరం ఉత్పత్తి చేసే రోగనిరోధక ప్రోటీన్లనే యాంటీబాడీస్ అని పిలుస్తారు. ఈ ప్రతిరోధకాలనే ఇమ్యునోగ్లోబులిన్ అని పిలుస్తారు. వ్యాధి కారకాలను ఎదుర్కొన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసే మొదటి యాంటీబాడీ ఐజీ ఎం. ఇది ప్రతిరోధకాలలో సుమారు 10% ఉంటుంది. రెండోరకమైన ఐజీ జి ఉత్పత్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ రక్తం, ఇతర శరీర ద్రవాలలో కనిపించే ప్రధానమైన యాంటీబాడీ ఇది. ఇక కొవిడ్‌ సోకినవారిలో హ్యూమోరల్‌, సెల్యులార్‌ అనే రెండు రకాల ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయి. హ్యూమోరల్‌లో సహజమైనవి, తటస్థీకరించేవి, యాంటి స్పైక్‌ యాంటిబాడీలు ఉంటాయి. ఇక సెల్యులార్‌ యాంటీబాడీల్లో టీ సెల్‌ ప్రతిస్పందన చురుకుగా ఉంటుంది. వీటికి దీర్ఘకాలంపాటు వైరస్‌ను గుర్తుంచుకుని శరీరానికి రక్షణనిచ్చే శక్తి ఉంటుంది. అందుకే వీటిని మెమొరీ సెల్స్‌ అని కూడా అంటారు. "వైరస్‌ను గుర్తించి, యాంటీబాడీలను తయారు చేసేందుకు టీసెల్స్‌, బీ సెల్స్‌కు సాయపడతాయి. సెల్యులార్‌ ప్రతిస్పందన వల్ల దీర్ఘకాలంలో మళ్లీ ఎప్పుడైనా వైరస్‌ సోకినా, దానికి వెంటనే యాంటీబాడీలు తయారవుతాయి" అని హ్యూమన్‌ ఇమ్యునోజెనిటిక్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌ ఆర్‌.ఎం. పిచ్చప్పన్‌ తెలిపారు.

టీకాల పనితీరుకు సూచికలా..?

టీకాల వల్ల ప్రతి నిరోధకాలు ఉత్పత్తి అవడమేగాక, కణజాల ప్రసారిత రోగనిరోధకత, టి కణాల వల్ల ఉత్పత్తయ్యే యాంటీబాడీలతో రక్షణ కలుగుతుంది. అయితే టీకాలతో జనించే ప్రతిరోధకాలను బట్టి మాత్రమే ఆ టీకాల సామర్థ్యాన్ని నిర్ధారించడం సరికాదు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి వంటి టీకాల సామర్థ్యం ఇంచుమించు సమానంగానే ఉందని పలు అధ్యయనాలు తెలియజేశాయి. కొందరు టీకా వేయించుకున్నాక ప్రతిరోధకాల పరిమాణం తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుంటున్నారు. "ఓ వ్యక్తి రోగనిరోధక శక్తిని కేవలం ప్రతిరోధకాలు మాత్రమే నిర్ధారించలేవు. కాబట్టి అలాంటి పరీక్షలు నిరర్ధకం. టీకా తీసుకున్నాక శరీరంలోని టి లేదా మెమొరీ కణాలు మరింత బలం పొందడం, నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి కొన్ని మార్పులు జరుగుతాయి. పైగా ఎముక మజ్జల్లో ఉండే టి-కణాల్లోని రోగనిరోధకత పరీక్షల్లో బయటపడదు" అని ఏఐఐఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గులేరియా పేర్కొన్నారు.

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటేనే టీకాలు పనిచేస్తున్నట్లా?

అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) ప్రకారం దాదాపు 77.4 శాతం మందిలో టీకాలు తీసుకున్నప్పుడు ఏడురోజుల్లో జ్వరం, అలసట, తలనొప్పి, వణుకు, విరేచనాలు, కండరాల నొప్పి, కీళ్లనొప్పి లాంటివాటిలో కనీసం ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. దీనర్థం మిగతావారిలో టీకాల ప్రభావం లేదని కాదు. టీకాలు శరీరంలో చేసే ప్రతి పనీ బయటకు మనకు తెలియాలనేం లేదు. పైగా కొంతమందికి కొవిడ్‌ వచ్చినా వారి రోగ నిరోధక శక్తి ఎలాంటి చిహ్నాలు కనిపించకుండా వైరస్‌ను తరిమికొడుతుంది.

యాంటీబాడీలు లేకపోతే ఆందోళన వద్దు

గతంలో ఇన్‌ఫెక్షన్‌ సోకిందో లేదో కనుక్కునేందుకు యాంటీబాడీల్లో ఐజీజీ, ఐజీఎం టెస్టులు చేస్తుంటారు. అయితే టీకాలు ఆ టెస్టుల్లో కనిపించని సంక్లిష్టమైన యాంటీబాడీలను కూడా ఉత్పత్తి చేస్తాయి. "ఎవరికైనా యాంటీ బాడీ టెస్టుల్లో నాన్‌ రియాక్టివ్‌ లేదా నెగటివ్‌ అని వస్తే, వారికి టీకాలు పనిచేయలేదని కాదు. నిజానికి యాంటీబాడీలకు, టీకాల పనితీరుకు ముడి పెట్టకూడదు" అని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్ డైరెక్టర్‌ రాబ్‌ మర్ఫీ తెలిపారు. కాబట్టి యాంటీబాడీల టెస్టుల కోసం వెళ్లక్కర్లేదని ఆయన చెప్పారు.

యాంటీబాడీలన్నింటికీ టెస్టులు లేవు!

"ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు తీసుకున్నాక వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీలు విడుదలైనా, అవి టెస్టుల్లో కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఆ పరీక్షల ద్వారా వాటిని కనుగొనలేకపోతున్నామని అర్థం చేసుకోవాలి" అంటారు 'ఎండీ ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌' డైరెక్టర్‌ ఫెర్నాండో మార్టినెజ్‌. "టీకాలకు హ్యూమోరల్‌ ప్రతిరోధకాలు లేనివారిలో, సెల్యులార్‌ స్థాయిలో విడుదలయ్యే టీ సెల్స్‌ యాంటీబాడీలను కనుక్కునేందుకు తగినంతగా పరిశోధన జరగలేదు. వారిలో మామూలు యాంటీ బాడీలు లేకపోయినా టీ సెల్స్‌ యాంటీబాడీలు వృద్ధిచెందే ఉంటాయి" అని హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్‌ డా. నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాబట్టి టీకాలు వేసుకోవడం వరకే మన విధి. టీకాలు తీసుకున్నాక యాంటీబాడీ టెస్టుల కోసం పరుగెత్తి ఆందోళన చెందటమో జేబులు గుల్ల చేసుకోవడమో అవసరం లేదు!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.