ETV Bharat / bharat

Doctors Strike: ఆ హామీతో సమ్మె విరమించిన డాక్టర్లు - కేంద్ర ఆరోగ్య శాఖ

Doctors Strike: దేశవ్యాప్త సమ్మెను విరమిస్తున్నట్లు రెసిడెంట్​ డాక్టర్లు ప్రకటించారు. నీట్ పీజీ కౌన్సిలింగ్​ జాప్యంగా కారణంగా రోడ్డెక్కిన వైద్యులు.. 14 రోజుల సుదీర్ఘ నిరసన తర్వాత సమ్మెను విరమించారు.

Doctors call off nationwide strike today
రెసిడెంట్​ డాక్టర్లు
author img

By

Published : Dec 31, 2021, 2:07 PM IST

Updated : Dec 31, 2021, 3:02 PM IST

Doctors Strike: రెసిడెంట్​ డాక్టర్లు 14 రోజుల తరువాత దేశవ్యాప్తంగా సమ్మెను విరమించారు. దిల్లీ పోలీస్​ కమిషనర్​తో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరసనలకు సంబంధించి వైద్యులపై ఎఫ్​ఐఆర్​ల ఉపసంహరణపై పోలీస్​ అధికారి హామీ ఇచ్చిన నేపథ్యంలో.. సమ్మెను ఆపారు.

సాయంత్రం సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రెసిడెంట్​ డాక్టర్ల సంఘం ప్రెసిడెంట్​ డా. మనీశ్​ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నమే.. వైద్యులు విధుల్లో తిరిగి చేరినట్లు తెలిపారు.

కౌన్సెలింగ్​లో జాప్యంపై..

నీట్​ పీజీ కౌన్సెలింగ్‌ ఆలస్యంపై రెసిడెంట్​ డాక్టర్లు నవంబర్​ 27న నిరసనకు దిగారు. అనంతరం.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా బయల్దేరారని నిర్ణయించుకున్నారు. అప్పుడే డాక్టర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో వారిపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సమ్మె బాట పట్టారు. 14 రోజుల అనంతరం.. ఇప్పుడు విరమించారు.

నీట్​ పీజీ కౌన్సెలింగ్​ 2022 జనవరి 6లోపు ప్రారంభం అవుతుందని.. కేంద్ర ఆరోగ్య మంత్రి హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) అధ్యక్షుడు సహజానంద్​ ప్రసాద్​ సింగ్​. వైద్యులపై ఎలాంటి ఎఫ్​ఐఆర్​లు ఉండబోవని పేర్కొన్నారు.

కొవిడ్​ కొత్త వేరియంట్​ గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని, అన్ని జాగ్రత్తలు మాత్రం పాటించాలని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: Supreme Court: 'మైనారిటీ తీరేదాకా పిల్లలను పోషించే బాధ్యత తండ్రిదే'

Last Updated : Dec 31, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.