కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం ఆపరేషన్ చేయించుకున్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత.. మళ్లీ కడుపులో నొప్పి మొదలైంది. దీంతో మరోసారి స్కానింగ్ తీసుకున్నాడు. ఆ రిపోర్టు రిజల్ట్ చూసి బాధితుడు విస్తుపోయాడు. కిడ్నీలో రాళ్లు వచ్చాయని ఆస్పత్రికి వెళ్తే.. కిడ్నీనే తీసేశాడో డాక్టర్. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
![doctor accidentally removed the kidney](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16895639_klasksh.jpg)
వివరాళ్లోకెళ్తే.. కాస్గంజ్ జిల్లా డీఎమ్ నివాసంలో సురేశ్ చంద్ర అనే వ్యక్తి హోంగార్డుగా పనిచేస్తున్నాడు. 2022 ఏప్రిల్ 12న వెన్ను నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేశారు వైద్యులు. అతడి ఎడమ కిడ్నీలో రాళ్లు వచ్చినట్లు రిపోర్టులో తేలింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల సూచనతో రెండు రోజుల తర్వాత 2022 ఏప్రిల్ 14న అలిగఢ్ ఆస్పత్రిలో అతడికి కిడ్నీ ఆపరేషన్ చేశారు. అనంతరం వైద్యుల సూచనతో కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం యథావిధిగా పనికి వెళ్లాడు. అయితే 2022 అక్టోబర్ 29న అతడికి సడెన్‌గా కపుడు నొప్పి రావడం మొదలైంది. దీంతో మళ్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకోగా.. రిపోర్టు చూసి విస్తుపోయాడు. రాళ్లను తొలగించేందుకు ఆపరేషన్ చేసేటప్పుడు పొరపాటున అతడి కిడ్నీ తొలగించారు వైద్యులు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు సురేశ్ చంద్ర.
![doctor accidentally removed the kidney](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-kas-02-removed-kidney-deception-up10018_10112022201130_1011f_1668091290_739.jpg)
![doctor accidentally removed the kidney](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-kas-02-removed-kidney-deception-up10018_10112022201130_1011f_1668091290_495.jpg)
ఇవీ చదవండి : మైనర్‌పై రిక్షా డ్రైవర్ల గ్యాంగ్‌రేప్.. స్కూల్ ఫీజు కట్టలేదని వేధింపులు.. ఫ్యాన్‌కు ఉరేసుకుని..