ETV Bharat / bharat

సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు - వేరే సామాజిక వర్గాల వారికి పూజారులుగా అవకాశం కల్పించినస్టాలిన్​ ప్రభుత్వం

బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన అర్చకత్వాన్ని ఇకపై ఇతర సామాజిక వర్గాల వారు కూడా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి శిక్షణను ప్రభుత్వం అందిస్తుంది. అలా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని వివిధ పుణ్యక్షేత్రాలను పూజారులుగా నియమించాలని... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ఆలయాల్లో పూజారులుగా 24 మంది బ్రాహ్మణేతరులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

all castes as priests in temples
పూజారులుగా బ్రాహ్మణేతరులు
author img

By

Published : Aug 15, 2021, 12:17 PM IST

ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే క్రమంలో తమిళనాడులోని స్టాలిన్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుశిక్షితులైన 24 మందిని రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాలలో అర్చకులుగా నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఎంకే ప్రభుత్వం శనివారం జారీ చేసింది. హిందూ మతానికి చెందిన మరో 75 మందిని వివిధ ధార్మిక శాఖలకు సంబంధించిన 208 స్థానాలకు నియమిస్తూ.. నియామక పత్రాలను ముఖ్యమంత్రి స్టాలిన్​ అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అర్చక శిక్షణను పూర్తి చేసుకున్న 24 మందితో పాటు రాష్ట్రంలోని ఇతర పాఠశాలలో శిక్షణ ముగించుకున్న మరో 34 మందికి కూడా ఈ నియామకంలో అవకాశం కల్పించారు. అంతేగాక మరో 208 మందిని భట్టాచార్యులుగా, ఇతర సాంకేతిక విభాగాల్లో నియమించినట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి. భట్టాచార్యులు శ్రీమహా విష్ణువు ఆలయంలో పూజారులు కాగా.. శివునిగుడిలో పూజలు నిర్వహించడానికి శైవుల సాంప్రదాయం ప్రకారం శిక్షణ పొందారు.

తమిళనాట స్టాలిన్​ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి.. ఆగస్టు 14 నాటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆలయ పూజారుల నియామకం చేపట్టింది. ఈ చర్యతో దివంగత నేత కరుణానిధి ఆశయం నెరవేరిందని స్టాలిన్​ తన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మోదీది మళ్లీ అదే స్టైల్​- ఈసారి కోల్హాపురీ తలపాగాతో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.