ETV Bharat / bharat

తేదీతో సంబంధం లేదు- ఆ 6గ్రామాల్లో బుధవారమే దీపావళి- కారణం ఏంటో తెలుసా? - చామరాజనగర్​లో బుధవారం దీపావళి పండుగ

Diwali Celebration Only on Wednesday in Karnataka : దీపావళి పండుగ కోసం అందరూ ఎదురు చూస్తుంటే.. ఓ ఆరు గ్రామాల ప్రజలు మాత్రం పండుగ ఏ రోజు వచ్చినా.. తాము మాత్రం బుధవారమే చేసుకుంటామని అంటున్నారు. అసలు బుధవారమే ఎందుకు? ఇంతకీ ఆరు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Celebrate Diwali Only Wednesday In Karnataka

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 2:20 PM IST

Diwali Celebration Only on Wednesday in Karnataka : దీపావళి పండుగను జరుపుకోవడానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ, కర్ణాటకలోని ఓ ఆరు గ్రామాలు మాత్రం పండుగను వాయిదా వేస్తున్నాయి. దీపావళి తర్వాత వచ్చే బుధవారం రోజున వీరు పండుగ జరుపుకుంటున్నారు. గత మూడు తరాలుగా పండుగను ఇలానే చేసుకుంటున్నారు.

చామరాజ​నగర్​ జిల్లా గుండ్లుపేట్​ తాలుకాలోని వీరనాపుర్, బన్నితలపుర్, ఇంగల్వాడి, మాద్రహళ్లి, మళవళ్లి, నెనెకట్టే గ్రామాల్లో ఈ దీపావళి పండుగను బుధవారం చేసుకుంటున్నారు. అందుకు కారణం బలి పాడ్యమి మంగళవారం రావటమే. దీపావళి, బలి పాడ్యమి రెండు బుధవారం రోజున వస్తేనే పండుగను ఆ రోజు చేసుకుంటామని గ్రామస్థులు తెలిపారు. లేకుంటే బలి పాడ్యమి తరవాత వచ్చే బుధవారం రోజున పండుగను నిర్వహించుకుంటామని వివరించారు. ఇలా బుధవారం పండుగను జరుపుకునే సంప్రదాయం గత మూడు తరాలుగా పాటిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు.

బుధవారమే ఎందుకంటే.. పండుగను బుధవారం కాకుండా వేరే రోజున చేసుకుంటే ఏదైనా కీడు జరిగి.. పశువులకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు. గతంలో బుధవారం కాకుండా.. సాధారణ రోజుల్లో పండుగ జరుపుకున్నప్పుడు గ్రామస్థులకు చెందిన ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. ఇలా ఏదోక కీడు జరుగుతుందని అప్పటి పెద్దలు బుధవారం రోజున పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆచారం పాటిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఆ గ్రామాల్లో దీపావళి రోజు నో సెలబ్రేషన్స్​- విదేశాల్లో ఉన్న వారు కూడా! 200 ఏళ్లుగా
Diwali Not Celebrating Villages : హిందూమతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు ఇంటినంతా దీపాల కాంతులతో నింపుతారు. అందుకే ఈ పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. ఆరోజు లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. టపాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారు వరకు ఎంతో ఇష్టంగా ఈ పండుగ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది దీపావళి పండుగను జరుపుకోకుండా ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కర్ణాటక, తమిళనాడులోని పలు గ్రామాల ప్రజలు.. కొన్నేళ్లుగా ఈ పండుగను ఎందుకు జరుపుకోవటం లేదో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

పక్షుల కోసం దీపావళి ఆనందం త్యాగం- 50 ఏళ్లుగా ఆ ఊర్లో ఇంతే!

దీపావళి వేళ దేశమంతా వెలుగులు- ఆ గ్రామాల్లో మాత్రం చీకట్లు, కారణం ఏంటంటే?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.