ఓ పానీపూరీ.. భార్యాభర్తల మధ్య గొడవకు దారితీసింది. అంతేకాదు, ఆ గొడవ తారస్థాయికి చేరుకుని ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
పుణెలో నివసిస్తున్న గహినీనాథ్ సర్వాడే ఇటీవల గ్రామంలో నివసిస్తున్న భార్య ప్రతీక్ష(23)ను పుణె తీసుకువచ్చాడు. కొద్ది రోజుల క్రితం గహినీనాథ్.. ఇంటికి పానీపూరీ (pani puri) తీసుకెళ్లాడు. తనను అడగకుండా పానీపూరీ ఎందుకు తెచ్చావ్ అంటూ భార్య.. అతనితో వాగ్వాదానికి దిగింది. ఈ విషయంపైనే వారు రెండు రోజుల పాటు గొడవ పడ్డారు. శనివారం రోజు.. ప్రతీక్ష, ఆవేశంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్త గహినీనాథ్ సర్వాడేను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి : నాలుగేళ్ల బాలికపై అత్యాచారం- నిందితుడ్ని చితకబాదిన బంధువులు