ఆర్ఎస్ఎస్, తాలిబన్లు మహిళలతో ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని.. ఇద్దరి భావజాలాలూ ఒకటేనని కాంగ్రెస్(Congress Party) సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ ఆరోపించారు. అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వంపై భారతదేశ వైఖరిని స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"మహిళలు మంత్రులుగా ఉండటానికి సరిపోరని తాలిబన్లు అంటున్నారు. మహిళలు ఇంట్లో ఉంటూ.. ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని మోహన్ భగవత్ చెప్పారు. ఈ రెండూ ఒకే విధమైన సిద్ధాంతాలు కావా?"
-దిగ్వజయ్ సింగ్ ట్వీట్
'పలు ఉగ్రవాద సంస్థల్లో సభ్యులైన వారు మంత్రులుగా ఉన్న తాలిబన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తిస్తుందా? లేదా? అనే విషయాన్ని మోదీ-షా ప్రభుత్వం స్పష్టం చేయాలి.' అని దిగ్విజయ్ ట్వీట్ చేశారు.
అంతకుముందు.. ఇందోర్‌లో నిర్వహించిన 'సంప్రదాయక్ సద్భావన సమ్మేళనం'లో ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్(Mohan Bhagwat rss) లక్ష్యంగా దిగ్విజయ్ విమర్శలు గుప్పించారు దిగ్విజయ్. హిందూ-ముస్లింల డీఎన్ఏ ఒకటేనన్న భగవత్ వ్యాఖ్యలపై స్పందించిన దిగ్విజయ్.. 'అలా అయితే లవ్ జిహాద్(Love Jihad) వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి?' అని ప్రశ్నించారు.
"ఆర్ఎస్ఎస్ ఏళ్లుగా విభజించు-పాలించు రాజకీయాలనే అవలంబిస్తోంది. అబద్ధాలు, అపోహలను వ్యాప్తి చేయడం ద్వారా హిందూ-ముస్లింలను రెండు వర్గాలుగా విభజిస్తోంది."
-దిగ్విజయ్ సింగ్
"ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్కు మద్దతిస్తున్నవారు.. తాలిబన్ల లాంటి వారే" అని బాలీవుడ్ గీత రచయిత జావెద్ అక్తర్(Javed Akhtar remarks) ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: