ETV Bharat / bharat

Viral: డీజిల్​ పైపు​ లీకేజీ.. ఎగబడిన జనం - చమోలీ న్యూస్

ఉత్తరాఖండ్​ చమౌలీలో.. పైప్​ లీకై డీజిల్​ నీటి ధారలా పారింది. ఈ డీజిల్​ను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్​గా మారింది.

diesel, Utharakhand
డీజిల్ పైపు లీక్, ఉత్తరాఖండ్
author img

By

Published : Aug 3, 2021, 2:01 PM IST

డీజిల్​ కోసం క్యాన్లు తీసుకొచ్చిన స్థానికులు

భారత్​లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ఉచితంగా డీజిల్​ వస్తుందంటే ఎవరు ఊరుకుంటారు. క్యాన్లు పట్టుకుని మాకంటే మాకని డీజిల్​​ కోసం ఎగబడతారు. ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్​ చమౌలీలో జరిగింది.

ఇదీ జరిగింది..

చమౌలీ కర్ణప్రయాగ్​లోని బద్రీనాథ్​ రహదారి ప్రాంతంలో ఓ డీజిల్​ పైపు లీకైంది. ఈ క్రమంలో గోడ నుంచి డీజిల్​ నీటిధారలా పారింది. ఇది చూసిన స్థానికులు.. క్యాన్లు, బాటిళ్లు పట్టుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్లు కూడా డీజిల్ కోసం ఎగబడ్డారు.

తమకు కావాల్సినంత డీజిల్​ తీసుకుని ఆ క్యాన్లు, బాటిళ్లలో ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు డీజిల్​ లీకవడం మొదలైనట్లు కొందరు స్థానికులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత పెట్రోల్​ పంపు ఆపరేటర్​కు సమాచారం అందించారు.

వేల లీటర్ల డీజిల్​ నేలపాలైనట్లు పంపు ఆపరేటర్ తెలిపారు. అయితే.. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చదవండి:అదనపు కట్నం కోసం కట్టేసి చిత్రహింసలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.