బుల్లెట్ బండికి ఉన్న క్రేజ్ వేరు. కేవలం 30 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చినప్పటికీ దానిని వాడడం చాలా మంది గర్వంగా భావిస్తారు. అయితే.. లీటరుకు 30 కిలోమీటర్లు ప్రయాణించే బుల్లెట్.. 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రతి ఒక్కరూ బుల్లెట్నే వాడుతారు కదా!. ఇంతకూ 80 కిలోమీటర్లు ఇచ్చే బుల్లెట్ కథేంటో తెలుసుకుందామా?
బిహార్ పట్నాలో 50 ఏళ్లుగా మెకానిక్‌గా పనిచేస్తున్నాడు మోహన్. అతని దగ్గర 1998నాటి ఓ పాత బుల్లెట్ ఉంది. దానిని ఆయన చాలా ఏళ్లుగా వాడుతున్నాడు. సృజనాత్మకతతో ఆ డీజిల్ ఇంజిన్ బుల్లెట్‌ను 350సీసీ ఇంజిన్ గల బుల్లెట్లా తయారు చేశాడు. అయితే.. సాధారణంగా బుల్లెట్ 30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. కానీ మోహన్ తయారు చేసిన బుల్లెట్ 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెరిగిన ఇంధన ఛార్జీలతో భారం ఎక్కువవుతుందని యువకులు చెబుతున్నారు. తమ బుల్లెట్‌తో పోలిస్తే మోహన్ బుల్లెట్ ఎంతో మేలని భావిస్తున్నారు.
"బుల్లెట్లో సాధారణంగా పెట్రోల్ పోస్తారు. కానీ ఇది డీజిల్‌తో నడిచే బండి. పాతతరం బండిని కొత్తతరం బుల్లెట్లా తయారు చేశాను. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి బండిలో డీజిల్ పోయిస్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నారు."
-మోహన్
కొత్త తరం బుల్లెట్లో బ్రేక్ కుడి భాగంలో, గేర్లు ఎడమభాగంలో ఉంటాయి. కానీ మోహన్ బుల్లెట్‌కు ఎడవ భాగంలో బ్రేక్, కుడి భాగంలో గేర్లు ఉన్నాయి. బుల్లెట్ ట్యాంకుకు 14లీటర్లు పట్టే సామర్థ్యం ఉంటుంది. ఒక్కసారి నింపితే మూడు నెలల వరకు ఉపయోగపడుతుందని మోహన్ చెబుతున్నాడు. డీజిల్ ఇంజిన్ బుల్లెట్ అయినప్పటికీ కొత్త తరం బుల్లెట్లా ఆకర్షణీయంగా ఉందని అంటున్నాడు.
ఇదీ చదవండి: కర్ణాటక కంబళ వీరుడి సరికొత్త రికార్డు.. 8.36 సెకన్లలో 100 మీటర్లు!