Uddhav Thackeray cabinet meet: సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబావుటా.. ప్రత్యర్థి పార్టీ రాజకీయ వ్యూహాలు.. బలపరీక్షలో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితి... ఇలాంటి పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో బుధవారం ముంబయిలో సమావేశమైంది ఆ రాష్ట్ర మంత్రివర్గం. ఔరంగాబాద్, ఒస్మానాబాద్ వంటి ప్రాంతాలకు పేర్లు మార్చాలన్న నిర్ణయాలకు తోడు.. మరికొన్ని కీలక పరిణామాలకు కేబినెట్ భేటీ వేదికైంది. ముఖ్యంగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
"మూడు పార్టీలు(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్) కలిశాయి. రెండున్నరేళ్లు మంచి పనిచేశాయి. అందరికీ కృతజ్ఞతలు. గురువారం బలపరీక్ష జరిగితే.. ఇది ఇక్కడితో అంతమైపోతుందో లేక కొనసాగుతుందో తేలిపోతుంది. కాంగ్రెస్, ఎన్సీపీ నాకు మద్దతుగా నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తూ నా సొంత పార్టీ వాళ్లు నాకు అండగా లేరు" అని ఉద్ధవ్ వ్యాఖ్యానించినట్లు మంత్రి, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కేబినెట్ భేటీ తర్వాత వెల్లడించారు.
ఇదీ చదవండి: